Telangana: బండి వర్సెస్ ఈటల.. ఆ మూడు సీట్ల కోసం ఫైట్!
తెలంగాణ బీజేపీలో టికెట్ల పంచాయితీ నడుస్తోంది. సంగారెడ్డి, వేములవాడ, హుస్నాబాద్ సీట్ల కోసం బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్ పట్టుబడుతున్నారట. అస్సలు వెనక్కి తగ్గడం లేదట.
తెలంగాణ బీజేపీలో టికెట్ల పంచాయితీ నడుస్తోంది. సంగారెడ్డి, వేములవాడ, హుస్నాబాద్ సీట్ల కోసం బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్ పట్టుబడుతున్నారట. అస్సలు వెనక్కి తగ్గడం లేదట.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీకి వరుస షాకులు ఇస్తున్నారు కమలం నేతలు. ఏళ్లుగా పార్టీలో ఉన్న నేతలు సైతం.. టికెట్ దక్కలేదనే ఆగ్రహంతో బీజేపికి రాజీనామా చేస్తున్నారు. ఓవైపు ఒకరిద్దరు పార్టీలో చేరుతుంటే.. మరోవైపు అంతకు రెట్టింపు నాయకులు పార్టీని వీడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, తెలంగాణ నాయకురాలు డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. అంతేకాదు.. బీజేపీ నినాదం మేరకు గద్వాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని నిలబెడతామన్నారు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఈ రోజు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.
జనసేనతో పొత్తుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. జనసేనతో పొత్తుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయన్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు.
మాజీ ఎంపీ వివేక్ టార్గెట్ గా బెల్లంపల్లి బీజేపీ అసంతృప్త నేత కొయ్యల హేమాజి మరోసారి విమర్శలు గుప్పించారు. వివేక్ తన అన్నను గెలిపించడం కోసం బెల్లంపల్లిలో బలహీనమైన అభ్యర్థికి టికెట్ వచ్చేలా చేశాడని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రిగా నియమిస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన హాట్ డిస్కషన్‌కు తెరలేపింది. ఒకవేళ బీజేపీ గెలిస్తే సీఎం రేసులో నిలిచేది వీరే అంటూ కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, బండి సంజయ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే.. బీజేపీలో బలమైన బీసీ నేతలుగా వీరు ముగ్గురు చలామణి అవుతున్నారు. దీంతో వీరిలో ఎవరు సీఎం అవుతారు? అనే చర్చ నడుస్తోంది.
తెలంగాణ బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా వచ్చేసింది. ఈ జాబితాలో కేవలం ఒక్కరి పేరును మాత్రమే ప్రకటించింది బీజేపీ. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. ఇప్పటికే మొదటి విడత జాబితాను విడుదల చేసిన బీజేపీ.. ఇప్పుడు రెండో విడత పేరుతో ఒక్కరి పేరునే ప్రకటించడం ఇంట్రస్టింగ్ గా మారింది.