Sharmila : మోదీకి లోకేష్ సారీ చెప్పడంపై షర్మిల విమర్శల దాడి
AP: మంత్రి లోకేష్ పై షర్మిల విమర్శల దాడి చేశారు. మోదీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మీరు.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ఎందుకు కట్టుబడిలేరు అని లోకేష్‌ను ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Minister Lokesh: ఇది జగన్ మేడ్ డిజాస్టర్.. లోకేష్ ఫైర్
AP: బురద రాజకీయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా జగన్ మారారని మంత్రి లోకేష్ అన్నారు. సొంత డబ్బుతో కనీసం పులిహోర ప్యాకెట్ అందజేసిన చరిత్ర ఆయనకు లేదని ఫైర్ అయ్యారు. బుడమేరు పొంగడానికి ప్రధాన కారణం జగన్.. ఇది జగన్ మేడ్ డిజాస్టర్ అని ధ్వజమెత్తారు.
Lokesh: శభాష్ రామానాయుడు - మంత్రి నారా లోకేష్
మంత్రి నిమ్మల రామానాయుడును మంత్రి నారా లోకేష్ అభినందించారు. బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులను పరిశీలించిన లోకేష్.. మంత్రి నిమ్మల పడిన కష్టాన్ని గుర్తించి శభాష్ అని ప్రశంసించారు. 64 గంటల పాటు నిద్రాహారాలు లేకుండా నిమ్మల చేసిన పనితీరును మెచ్చుకున్నారు.
లోకేష్ ను కాపాడడం కోసమే.. గుడ్లవల్లేరు ఘటనపై జగన్ సంచలన కామెంట్స్!
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల ఘటనపై మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థ దెబ్బతిన్నదని ధ్వజమెత్తారు.
Nara Lokesh: విద్యాకమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదు.. అధికారులకు మంత్రి లోకేష్ హెచ్చరిక..!
విద్యాకమిటీలు ఏర్పాటు చేసింది పెత్తనం చేయడానికి కాదని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెంచాలన్నారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా విద్యాకమిటీల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. పెండింగ్ లో ఉన్న ఆయాల జీతాలు, కెమికల్ బిల్స్ చెల్లిస్తామని చెప్పారు.
AP: వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు..!
ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరారు. వీరితో పాటు పలువురు వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
AP : కువైట్‌లో చిక్కుకున్న మరో తెలుగు మహిళ.. !
కువైట్‌లో మరో తెలుగు మహిళ నాగమణి చిక్కుకుంది. యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నానంటూ నాగమణి వీడియో విడుదల చేసింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, రోజూ నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ తనను కాపాడాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
/rtv/media/media_files/J4Us1WYPunvKulPXn9y0.jpg)
/rtv/media/media_files/2024/10/16/v9Mi5rP6Ifik3U8ryZ2b.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/lokesh-jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/lokesh-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Jagan-sensational-comments-on-gudlavalleru-college-issue-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/lokesh-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/nara-lokesh.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/lokesh-1.jpg)