G20 Summit: జీ 20 సదస్సులో మోడీ ముందు 'భారత్' నేమ్ ప్లేట్!
ప్రధాని మోడీ కూర్చుని ఉన్న సీటు ముందు ''భారత్'' అనే నేమ్ ప్లేట్ కనిపించింది. ఈ అంశం గురించి ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది.
ప్రధాని మోడీ కూర్చుని ఉన్న సీటు ముందు ''భారత్'' అనే నేమ్ ప్లేట్ కనిపించింది. ఈ అంశం గురించి ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది.
జీ20 సమ్మిట్ కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న ఆయనకు పలువురు కేంద్రమంత్రులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బైడెన్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతికి కార్యక్రమాలను కాసేపు ఆసక్తిగా తిలకించారు.
సమావేశాలు గురించి తెలియజేయాలంటూ వాటి వివరాలు కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Modi) కి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) లేఖ రాశారు.
పీఈడబ్ల్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సుమారు పదేండ్ల పాలన తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలు సానుకూలంగా వున్నట్టు సర్వే పేర్కొంది. దేశంలో 80 శాతం ప్రజలు ప్రధాని మోడీ పట్ల సానుకూలమైన అభిప్రాయాన్ని కలిగి వున్నారని సర్వే వెల్లడించింది. ఇటీవల ప్రపంచ దేశాల్లో భారత్ మరింత ప్రభావ వంతంగా మారిందని పది మందిలో ఏడుగురు భారతీయులు విశ్వసిస్తున్నట్టు సర్వేల్లో వెల్లడైందన్నారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రెడ్ డైరీ విషయంలో సీఎం పదవికి ఆశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలన్నారు. రెడ్ డైరీని చూసి గెహ్లాట్ భయపడుతున్నారని ఆయన అన్నారు. అసలు రెడ్ డైరీ గురించి సీఎం అశోక్ గెహ్లాట్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని పేర్కొన్నారు.
చైనా వక్ర బుద్ది మరోసారి బయట పడింది. తాజాగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోడీలు అనధికారికంగా భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. భారత్ కోరినందునే ఈ సమావేశం జరిగిందని చైనా చెప్పుకొచ్చింది. కానీ ఈ వాదనను భారత్ తోసి పుచ్చింది. భారత్ అలాంటి విజ్ఞప్తి చేయలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.
విదేశీ గడ్డపై కూడా భారత పతాకానికి ప్రధాని మోడీ విధేయత చూపారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో జరిగిన ఓ ఘటన జాతీయ పతాకం పట్ల ప్రధాని మోడీకి వున్న గౌరవానికి అద్దం పడుతోంది. ప్రధాని మోడీ చూపిన విధేయతను చూసి అక్కడ వున్న వాళ్లు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్‌గా చంద్రయాన్-3 ల్యాండింగ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించనున్నారు. దక్షిణాఫ్రికాలో మూడు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ప్రధాని.. 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్నారు. రేపు(ఆగస్టు 23) చంద్రయాన్-3 జాబిల్లిపై ల్యాండ్ అవ్వనుంది. సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండ్ అవ్వనుంది.
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అవ్వాలని యావత్ దేశం దేవుళ్లకు ప్రార్థిస్తోంది. దేశం మొత్తం ఇప్పుడు చంద్రయాన్ జపం చేస్తోంది. 2019లో చంద్రయాన్-2 చివరి మెట్టుపై బోల్తా పడడాన్ని ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు.. నాటి జ్ఙాపకాలను గుర్తు చేసుకుంటూనే ఈసారి మాత్రం ఇస్రో సైంటిస్టులు విజయం సాధించాలని అంతా కోరుకుంటున్నారు. ఆగస్టు 23, సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపనుంది.