CBN : చంద్రబాబు కోసం ఐదేళ్లుగా సొంతంటికి దూరమైన మహిళ
2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించి సీఎం అవుతారని చేసిన ఛాలెంజ్ ఓడిన మహిళ ఐదేళ్లపాటు పుట్టింటికి దూరమయ్యారు. తాజాగా చంద్రబాబు ఏపీ సీఎం కావడంతో స్వగ్రామానికి వెళ్లారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించి సీఎం అవుతారని చేసిన ఛాలెంజ్ ఓడిన మహిళ ఐదేళ్లపాటు పుట్టింటికి దూరమయ్యారు. తాజాగా చంద్రబాబు ఏపీ సీఎం కావడంతో స్వగ్రామానికి వెళ్లారు.
AP: వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు ప్రలోభాలకు లొంగొద్దు అని అన్నారు. మనపై కేసులు పెట్టినా బయపడొద్దని చెప్పారు. బీజేపీ, జనసేన, టీడీపీ హనీమూన్ నడుస్తోందని.. వారికి మరికొంత సమయం ఇద్దామని అన్నారు.
AP: ఓటమిపై తరువాత మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. రోజూ ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో భేటీ అవుతున్నారు. కాగా మరోసారి పాదయాత్ర చేసేందుకు జగన్ సిద్దమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఏపీ మాజీ సీఎం జగన్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రేపటి తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేందుకు ఫోన్ చేయగా.. చంద్రబాబు ఫోన్‌కు జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం. ఇక కాసేపటి క్రితమే చంద్రబాబు గవర్నర్‌ను కలవగా ప్రభుత్వ ఏర్పాటును గవర్నర్ ఆహ్వానించారు.
జగన్ ఓడిపోవడంలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఉందని వైసీపీ అభిమాని రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. రాజమండ్రి గామన్ బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకి తన కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేశాడు. సకాలంలో స్పందించిన పోలీసులు వారిని అడ్డుకొని క్షేమంగా ఇంటికి చేర్చారు.
AP: జగన్ పరిపాలనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కక్ష తీర్చుకోవాలని అనుకుంటే మనకు కూడా సమస్య వస్తుందని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తనను, తన కుటుంబాన్ని అవమానించారని అన్నారు.
విశాఖలోని రుషికొండను చంద్రబాబు ఏం చేయబోతున్నారు? చంద్రబాబు హయాంలో నిర్మించిన హరిత రిసార్ట్స్‌ను కూల్చిన జగన్ సర్కార్ కొత్త భవనాలు నిర్మించింది. మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావడంతో రుషికొండ అంశం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
AP: వైసీపీ నేతల మీద దాడులపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు వేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని అన్నారు.
మీ కష్టాలలో మీ ఇంట్లో ఒకటిలా నేను ఉంటానని మాట ఇస్తున్నానని పవన్ అన్నారు. మీ ఇంట్లో ఒకడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి... మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడని, నాకు కులాలకు, మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మా కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఒకడు అనుకోవాల్సిందే అని పవన్ అన్నారు.