ఆ జిల్లాల్లో కుండపోత వర్షం | Heavy Rains Alert To AP Telangana | RTV
ఆ జిల్లాల్లో కుండపోత వర్షం | Heavy Rains Alert To AP Telangana | RTV | Heavy Railfall is expected in both telugu states in a view of the precautionary measures suggested by IMD
ఆ జిల్లాల్లో కుండపోత వర్షం | Heavy Rains Alert To AP Telangana | RTV | Heavy Railfall is expected in both telugu states in a view of the precautionary measures suggested by IMD
ఎండలతో ఉక్కురిబిక్కిరి అవుతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రేపటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఒక ఎత్తైన ఉపరితల ద్రోణి ఏర్పడినందువల్లే ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. శనివారం, ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే వీలున్నట్లు చెప్పారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాలు ఏపీ-తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.