Heat Alert: ఏపీ ప్రజలకు అలర్ట్..నేడు ఆ మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు!
వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది.
వాతావరణ శాఖ ఏపీకి ఓ కీలక హెచ్చరికను జారీ చేసింది. సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర మైన వడగాల్పులు, 151 మండలాల్లో వడగాలులు విపరీతంగా ఉంటాయని పేర్కొంది.
ప్రకాశం జిల్లా సోమిదేవిపల్లెలోని గుడిలో అపశృతి చోటుచేసుకుంది. హోమగుండం పూజా కార్యక్రమంలో మంటలు చెలరేగి టెంట్ హౌస్, ఉత్సవిగ్రహాలు దగ్ధం అయ్యాయి. పూజా సామగ్రి, విగ్రహాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎండ తీవ్రత ఎక్కువుగా ఉండటంతో మంటలను అదుపు చేయలేక పోయారు.
తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఐదు రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అంతేకాకుండా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణశాఖలు హెచ్చరిస్తున్నాయి.
వాతావరణ శాఖ ఈసారి ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ఎందుకు హెచ్చరిస్తుంది. ఈ మూడు నెలలు ఉత్తర భారతదేశం చాలా వేడిగా ఉంటుందని ఎందుకు చెబుతోంది. అసలు ఉష్ణోగ్రతలు పెరగాటానికి కారణాలు ఎంటో తెలుసుకోండి!
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగలతో తెలంగాణ జనమంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9కే మండే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ 1న 43 డిగ్రీల మార్క్ ను దాటాయి ఉష్ణోగ్రతలు.
సూర్యుడు భగభగమంటున్నాడు. వేసవి ఉష్ణోగ్రతలు మీ శక్తిని తగ్గించగలవు. అలాగే మీ సాధారణ పనులను కూడా కష్టతరం చేస్తాయి. వేసవిఉష్ణోగ్రతను అధిగమించడంలో మీకు సహాయపడే 6 సాధారణ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.
మార్చి 2 వ వారం కూడా రాకముందే ఎండలు మండుతుండడంతో పాత రికార్డులను భానుడు తిరగరాస్తాడని వాతావరణశాఖాధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉంటే రెండవ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 40 డిగ్రీల వరకు చేరే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.