/rtv/media/media_files/2025/03/12/c8NcmxP5Aj3US3RZ49U7.jpg)
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) పై తీవ్ర విమర్శలు చేశారు ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉందన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ దారుణమైన ప్రదర్శన తర్వాత అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ క్రికెట్ బోర్డు తరుచుగా కెప్టెన్, కోచ్ లను మార్చడం, కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ ఉండటం లేదన్నాడు. కోచ్ లు ప్లేయర్లను నిందించడం.. మేనజ్ మెంట్ స్టాప్, తమ పదవుల్ని కాపాడుకునేందుకు కోచ్లు, ఆటగాళ్లను నిందించడం విచారకరమని అభిప్రాయపడ్డాడు.
గత టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) నుంచి ఆటకు దూరంగా ఉన్న ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ ను తిరిగి జట్టులోకి తీసుకుని, న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసంసల్మాన్ అలీ అఘా స్థానంలో వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే ఈ వ్యవహారంపై ఆఫ్రిది ఫైర్ అయ్యాడు. ఏ ప్రాతిపదికన అతన్ని వెనక్కి పిలిచారని ప్రశ్నించాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని ప్రదర్శన ఎలా ఉందని నిలదీశాడు. అతన్ని మళ్లీ జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారని అఫ్రిది ప్రశ్నించాడు. అర్హత ఆధారంగా నిర్ణయాలు తీసుకునే వరకు పాకిస్తాన్ క్రికెట్‌లో ఏమీ మారదని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు.
Also read : హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
Also read : రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు
భారత్ నిండా మ్యాచ్ విన్నర్లే
ఇక ప్రస్తుతం క్రికెట్లో టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని అన్నాడు అఫ్రిది. ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడినా భారత్ ను ఓడించలేరని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నారని తెలిపాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ టాప్ ఫామ్‌లో ఉన్నారని.. ప్రస్తుతం టీమ్ ఇండియాను ఓడించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలేనని తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి వారు పూర్తి అర్హులేనని వెల్లడించాడు. భారత్‌కు తన తరుపున శుభాకాంక్షలు అని వెల్లడించాడు.
Also read : ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!