IND vs NZ : టీమిండియాకు బిగ్ షాక్.... రోహిత్ శర్మకు గాయం !

న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది.  పాక్ తో మ్యాచ్ లో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ కు గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడని సమాచారం.

New Update
rohit  out

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో 2025 మార్చి 02వ తేదీన జరగబోయే మ్యాచ్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడటం లేదని తెలుస్తోంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. తాజాగా ప్రాక్టీస్ సెషన్ లోనూ రోహిత్ యాక్టివ్ గా పాల్గొనలేదు.  దీంతో  రోహిత్ శర్మకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చిందని సమాచారం.  

న్యూజిలాండ్‌ మ్యాచ్ కు గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడని..  రాహుల్ ను ఓపెనర్ గా పంపి.. పంత్ ను వికెట్ కీపర్ గా తీసుకునే అవకాశం ఉంది.  మార్చి 2న దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీ-ఫైనల్స్‌లో తమ స్థానాలను ఖాయం చేసుకున్నాయి. ఇక  ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు రిషబ్ పంత్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్ ఆటగాళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.  

మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వ్యక్తిగ‌త కార‌ణాల‌తో స్వదేశానికి వెళ్లిన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్  తాజాగా జట్టుతో కలిశాడు.  ఆటగాళ్ల ప్రాక్టీస్ ను దగ్గరుండి ప‌ర్యవేక్షించాడు.  ఈనెల 18న త‌ను సౌతాఫ్రికాకు  వెళ్లాడు మోర్నీ మోర్కెల్.  

టీమిండియా జట్టు( అంచనా )  

శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు