Rajasthan Royals : ఐపీఎల్‌లో భారీ డీల్: రికార్డు ధరకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్!

రాజస్థాన్ రాయల్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే పూర్తిస్థాయిలో విదేశీ యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన మొదటి ఫ్రాంచైజీగా నిలిచింది. గత ఆరు నెలలుగా సాగుతున్న ఈ విక్రయ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది.

New Update
rr

రాజస్థాన్ రాయల్స్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే పూర్తిస్థాయిలో విదేశీ యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన మొదటి ఫ్రాంచైజీగా నిలిచింది. గత ఆరు నెలలుగా సాగుతున్న ఈ విక్రయ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. 2008లో కేవలం 67 మిలియన్ డాలర్లకు అమ్ముడైన ఈ జట్టు, ఇప్పుడు ఏకంగా 1.63 బిలియన్ డాలర్ల అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.15,301 కోట్లు భారీ ధరకు చేతులు మారింది.

ఈ జట్టును అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమనీ నేతృత్వంలోని ఒక కన్సార్టియం కొనుగోలు చేసింది. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ వారసుడు రాబ్ వాల్టన్, అలాగే ఎన్ఎఫ్ఎల్ జట్టు డెట్రాయిట్ లయన్స్ యజమానులైన హాంప్ కుటుంబం ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు. ఇందులో షీలా ఫోర్డ్ హాంప్ కూడా ఉన్నారు, ఈమెకు ప్రసిద్ధ ఫోర్డ్ మోటార్ కంపెనీలో కూడా కీలక వాటాలు ఉన్నాయి.

టెక్నాలజీ రంగంలో మంచి పట్టు

ఇక ఈ కొనుగోలులో కీలక పాత్ర పోషించిన కల్ సోమనీకి టెక్నాలజీ రంగంలో మంచి పట్టు ఉంది. ఆయన ఇంట్రా ఎడ్జ్, ట్రూయో వంటి ప్రముఖ సంస్థల వ్యవస్థాపకులు. కేవలం టెక్నాలజీయే కాకుండా క్రీడారంగంలో కూడా ఆయనకు ముందు నుంచే ఆసక్తి ఉంది. మోటార్ సిటీ గోల్ఫ్ క్లబ్ సహ యజమానిగా, అలాగే టీఎమ్ఆర్‌డబ్ల్యూ (TMRW) స్పోర్ట్స్‌లో తొలి పెట్టుబడిదారుడిగా ఆయనకు మంచి పేరుంది.

ఐపీఎల్ తొలి సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళ్లడం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ మార్పుతో జట్టు భవిష్యత్తు,  ఐపీఎల్ బ్రాండ్ విలువ మరింత పెరిగే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు