Manu Bhaker: అవార్డు ఇవ్వమని అడుక్కోవాలా.. ఖేల్ రత్నపై మను తండ్రి ఫైర్

పారిస్ ఒలింపిక్స్‌ విజేత మను బాకర్‌కు ఊహించని షాక్ తగిలింది. క్రీడా అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న అవార్డుల జాబితాలో ఆమెకు చోటు దక్కలేదని తెలుస్తోంది. దీనిపై మను తండ్రి రామ్‌కిషన్‌ బాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మను అప్లికేషన్ ఇవ్వలేదని కమిటీ చెబుతోంది. 

New Update
manu bakar

Manu Bhaker (Khel Ratna)

Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్‌ విజేత షూటర్‌ మను బాకర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్‌ సాధించి తొలి అథ్లెట్‌ చరిత్ర సృష్టించిన ఆమెకు.. క్రీడా అత్యున్నత పురస్కారం ఖేల్ రత్న అవార్డుల నామినేషన్స్ జాబితాలో చోటు దక్కలేదని తెలుస్తోంది.

రామ్‌కిషన్‌ బాకర్‌ ఆగ్రహం..

ఈ మేరకు మేజర్‌ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల లిస్ట్ తయారు చేయగా.. ఇందులో మనుబాకర్‌ పేరు లేదని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఖేల్ రత్నాకోసం స్వయంగా తాము అప్లికేషన్ పంపించినా తన కూతురుకు అవకాశం ఇవ్వలేదని రామ్‌కిషన్‌ బాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇది కూడా చదవండి: Seethakka: స్మగ్లర్ హీరోకు అవార్డులా.. బన్నీపై మరోసారి సీతక్క ఫైర్!

అవార్డులు ఇవ్వాలని అడుక్కోవాలా..

అయితే దీనిపై స్పందించిన అధికారిక వర్గం.. మను బాకర్ ఎలాంటి అప్లికేషన్ ఇవ్వలేదని ప్రకటించింది. 12 మందితో కూడిన జాతీయ స్పోర్ట్స్‌ డే కమిటీ మాత్రం మనుబాకర్‌కు అవకాశం ఇవ్వనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రామ్ కిషన్ బాకర్..  'ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌ కు అవార్డులు ఇవ్వాలని అడుక్కోవాలా. ప్రభుత్వంలోని ఓ అధికారి ఇదంతా చేస్తున్నారు. కమిటీ సభ్యులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు. ఇదేనా మీరు అథ్లెట్లను ప్రోత్సహించే పద్ధతి. మేము దరఖాస్తు చేశాం. కానీ కమిటీ నుంచి ప్రతిస్పందన లేదు. ఇలాగైతే పిల్లలను పేరెంట్స్ ఎలా ప్రోత్సహిస్తారు' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు