IPL 2026 RCB vs SRH: బెంగళూరులో బిగ్ ఫైట్.. మొదటి గెలుపు ఎవరిది..? మ్యాచ్ ప్రిడిక్షన్, పిచ్ రిపోర్ట్ ఇదిగో!

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో Royal Challengers Bengaluru, Sunrisers Hyderabadతో బెంగళూరులో తలపడనుంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌తో భారీ స్కోరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు హెడ్ టు హెడ్‌లో SRH, RCB పై స్వల్ప ఆధిక్యంలో ఉంది.

New Update
IPL 2026 RCB vs SRH

IPL 2026 RCB vs SRH

IPL 2026 RCB vs SRH: ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో Royal Challengers Bengaluru VS  Sunrisers Hyderabad జట్లు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం M. Chinnaswamy Stadiumలో తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా ఆర్సీబీ బరిలోకి దిగుతుండగా, హైదరాబాద్ జట్టు కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ Virat Kohli మళ్లీ ఆడటం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. మరోవైపు హైదరాబాద్ జట్టులో Travis Head, Abhishek Sharma జంట పవర్ హిట్టింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపిస్తోంది. వీరికి తోడు మంచి ఫామ్‌లో ఉన్న Ishan Kishan కూడా జట్టుకు మరో బలం. 2024లో ఈ జంట 30 బంతుల్లోనే 100 పరుగులు చేసిన రికార్డు ఉంది. పవర్‌ప్లేలో భారీ స్కోర్లు చేయగల సామర్థ్యం వీరికి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి Rajat Patidar నాయకత్వం వహిస్తాడు. హైదరాబాద్ జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ Pat Cummins గాయం కారణంగా దూరంగా ఉండటంతో తాత్కాలికంగా ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు.

హెడ్ టు హెడ్ రికార్డు

ఇప్పటివరకు ఈ రెండు జట్లు 26 సార్లు ఎదురుపడ్డాయి.

  • ఆర్సీబీ గెలిచిన మ్యాచ్‌లు: 11
  • హైదరాబాద్ గెలిచిన మ్యాచ్‌లు: 13
  • ఫలితం రాని మ్యాచ్‌లు: 2

దీంతో హైదరాబాద్‌కు స్వల్ప ఆధిక్యం ఉంది.

పిచ్ రిపోర్ట్

చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలం. బంతి బాగా బౌన్స్ అవుతుంది, ఔట్‌ఫీల్డ్ వేగంగా ఉంటుంది. బౌండరీలు చిన్నగా ఉండటంతో బ్యాటర్లు సులభంగా పరుగులు చేయగలరు.

ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ స్కోరు 190 లేదా అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు (డ్యూ) ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేయడం మంచిదిగా భావిస్తున్నారు.

వాతావరణం

మ్యాచ్ సాయంత్రం 7:30కి ప్రారంభమవుతుంది. వాతావరణం క్లియర్‌గా ఉంటుంది.

  • ఉష్ణోగ్రత(Temperature): 24°C నుంచి 28°C
  • ఆర్ద్రత(Humidity): సుమారు 60%
  • వర్షం వచ్చే అవకాశం చాలా తక్కువ (5% లోపు)

ఆర్సీబీ జట్టు:

Virat Kohli, Rajat Patidar, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషారా, సుయాష్ శర్మ, క్రునాల్ పాండ్యా

హైదరాబాద్ జట్టు:

Travis Head, అనికేత్ వర్మ, హెన్రిచ్ క్లాసెన్, Ishan Kishan, Abhishek Sharma, నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, బ్రైడన్ కార్స్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ

మొత్తంగా చూసుకుంటే ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు వచ్చే అవకాశం ఉంది. రెండు జట్లలోనూ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండటంతో అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. టాస్ గెలిచిన జట్టు నిర్ణయం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు