BIG BREAKING: కోల్‌కతాలో మెస్సీ ఫ్యాన్స్ ఫైర్.. గ్రౌండ్‌లోకి వాటర్ బాటిళ్లు విసురుతూ రచ్చ!

కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో కుర్చీలు, ఫ్లెక్సీలు ధ్వంసం చేసి వాటర్ బాటిళ్లు విసిరేశారు. పోలీసులు జోక్యం చేసుకుని మెస్సీ టీమ్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు.

New Update
BIG BREAKING

BIG BREAKING

BIG BREAKING: కోల్‌కతాలో ఫుట్‌బాల్ అభిమానుల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ నగర పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియానికి రావడంతో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. మెస్సీని ప్రత్యక్షంగా మ్యాచ్‌ ఆడటం చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు.

Also Read: తెలంగాణలో దారుణం.. భార్యను చంపి ఎస్ఐకు వీడియో.. ఆ తర్వాత తాను కూడా..!

అయితే అనుకోకుండా మెస్సీ మ్యాచ్ ఆడకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోవడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. దీంతో కొందరు అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. స్టేడియంలో ఉన్న కుర్చీలు, ఫ్లెక్సీలు ధ్వంసం చేయడంతో పాటు వాటర్ బాటిళ్లు మైదానంలోకి విసిరేశారు. కొంతమంది బారికేడ్లు దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.

Also Read: శీతాకాలంలో జర పదిలం.. పొంచి ఉన్న 10 గుండె జబ్బులివే!

Fans Angry at Messi Event in Kolkata

పరిస్థితి అదుపు తప్పుతుందని గుర్తించిన అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. మెస్సీ టీమ్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరకు సొరంగ మార్గం ద్వారా మెస్సీ, అతని బృందం స్టేడియం నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం.

Also Read: పాక్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు.. దేశవిభజన తరువాత తొలిసారిగా..

ఈ ఘటనతో స్టేడియం పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలుపుతున్నారు.

మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముందుగా సరైన సమాచారం ఇవ్వకపోవడమే ఈ గందరగోళానికి కారణమని కొందరు అభిమానులు అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు