Karnataka: రెండు రోజులు స్కూల్స్, కాలేజీలు బంద్.. ఎందుకంటే?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ డిసెంబర్ 10 తెల్లవారుజామున 2:45 గంటలకు కన్నుమూశారు. ఆయనకు సంతాపంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. కర్ణాటకలో డిసెంబరు 10, 11, 12 సంతాప దినాలు.

author-image
By K Mohan
New Update
closed

రెండు రోజులు విద్యా సంస్థలు బంద్. కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలలతో సహా అన్ని విద్యాసంస్థలు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. దివంగత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ డిసెంబర్ 10 తెల్లవారుజామున 2:45 గంటలకు కన్నుమూశారు. ఆయనకు సంతాప దినంగా రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది.

ఇది కూడా చదవండి : బెళగావిలో రణరంగం..రిజర్వేషన్ల కోసం ఆందోళన

Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్!

Karnataka Schools And Colleges Holidays

డిసెంబరు 10, 11, 12 సంతాప దినాలుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సమయంలో పబ్లిక్ వినోద కార్యక్రమాలు నిషేధించబడ్డాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు సగం మాస్ట్‌లో ఎగురవేయబడతాయి. మూడు రోజులు కర్ణాటక ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించింది.

ఇది కూడా చదవండి : ఇండియన్ నావీ 78 మంది బంగ్లాదేశీయులను అరెస్ట్

మే 1, 1932న మండ్య జిల్లాలోని సోమనహళ్లిలో జన్మించిన కృష్ణ మహారాష్ట్ర గవర్నర్‌గా మరియు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. బెంగళూరును ఇండియన్ సిలికాన్ వ్యాలీగా మార్చడంలో SM కృష్ణ కీలక పాత్ర పోషించారు. అంత్యక్రియలు డిసెంబర్ 11(బుధవారం) ఆయన స్వగ్రామమైన మాండ్యలో జరగనున్నాయి. 2023లో మాజీ ముఖ్యమంత్రి MS కృష్ణ పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. 

ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు