Actor Karunas: కోలీవుడ్ నటుడు కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కలకలం!

చెన్నై విమానాశ్రయంలో కోలీవుడ్ సీనియర్ నటుడు కరుణాస్‌ బ్యాగులో బుల్లెట్లు పట్టుబడడం కలకలం రేపింది. కరుణాస్‌ హ్యాండ్‌బ్యాగ్‌లో 40 బుల్లెట్లు ఉన్నట్లు సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

New Update
Actor Karunas: కోలీవుడ్ నటుడు కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు.. చెన్నై  ఎయిర్‌పోర్ట్‌లో  కలకలం!

Tamil Actor Karunas: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తిరువాడనై నియోజకవర్గం మాజీ ఎమైల్య్ కరుణాస్ బ్యాగ్ లో బుల్లెట్లు పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. నటుడు కరుణాస్ వ్యక్తిగత పనుల నిమిత్తం చెన్నై నుంచి తిరుచ్చి బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఉదయం జూన్ 2న చెన్నై విమానాశ్రయానికి వెళ్లారు.

బ్యాగులో 40 బుల్లెట్లు

అయితే విమానాశ్రయంలో చెక్ ఇన్ లో భాగంగా ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఆయన క్యారీ-ఆన్ బ్యాగ్‌ని తనిఖీ చేయగా.. బ్యాగులో 40 బుల్లెట్లు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వెంటనే ఆయన ప్రయాణాన్ని రద్దు చేసిన పోలీసులు విచారణ కొనసాగించినట్లు తెలిసింది. విచారణలో బ్యాగులో బుల్లెట్లు ఎలా వచ్చాయని పోలీసులు దర్యాప్తు చేయగా.. తన వద్ద తుపాకీ లైసెన్స్ డాక్యుమెంట్లు ఉన్నట్లు చూపించారు. ఫ్లైట్ ఎక్కే తొందరలో బ్యాగ్ లోంచి బుల్లెట్ తీయడం మర్చిపోయానని తెలిపినట్లు సమాచారం.

నటుడు కరుణాస్ విమానాశ్రయ భద్రతను ఉల్లంఘించడం ఇంకా విచారణలో ఉంది. ఈ ఘటనతో తిరుచ్చి వెళ్లాల్సిన విమానం దాదాపు 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు