ఇండియాలో గూగుల్ ఎక్కువ ప్రజాధరణ పొందిన సంస్థ. మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా టక్కుమని గూగుల్ సెర్చ్ చేస్తాము. ఈ ఏడాది ఐపోవొచ్చింది. 2024 డిసెంబర్‌లో దాదాపు 20 రోజులు మిగిలి ఉంది. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇండియన్స్ గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా? ఈ సంవత్సరం మొత్తం గూగుల్‌లో భారతీయులు ఆసక్తిగా సెర్చ్ చేసిన విషయాలను టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. ఇండియన్స్ గూగుల్ సెర్చ్‌లో టాప్ 5లో నిలిచిన పదాలను ఇప్పుడు చూద్దాం. ఇది కూడా చదవండి : దోమలు ఆ వ్యక్తుల బ్లడ్ మాత్రమే తాగుతాయట.! అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు ఇండియన్స్ ఇంట్రెస్టింగ్‌గా గూగుల్‌లో వెతికిన అంశాల్లో ఫస్ట్ ప్లేస్‌లో క్రికెట్ ఉంది. మొదటి రెండు ప్లేస్‌లను క్రికెటే ఆక్రమించింది. భారతీయులు గూగుల్‌లో వెతికిన పదాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) , టీ 20 ప్రపంచకప్‌లు టాప్ 2లో ఉన్నాయి. తర్వాత భారతీయ జనతా పార్టీ, 2024 ఎన్నికల ఫలితాలు మూడవ, నాల్గవ స్థానాల్లో ఉంది. ఎందుకంటే ఈ ఏడాది పార్లమెంట్ ఎలక్షన్స్, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి. ఈ ఏడాదిలో టాప్ 5 ప్లేస్ లో 2024 ఒలింపిక్స్ గురించి వెతికారు భారతీయులు. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో కెటగిరీలుగా ఈ సంవత్సరం ఎక్కువగా ఇండియన్స్ వెతికిన పదాలను ప్రకటించింది. అర్థాల గురించి తెలుసుకోవడానికి వెతికిన పదాలు వరుసగా 1. ఆల్ ఐస్ ఆన్ రఫా2.అకాయ్3.సర్వికల్ క్యాన్సర్4.తవైఫ్5.డెమూర్ అనే పదాల గురించి ఎక్కువగా భారత దేశంలో వెతికారు. మూవీస్ పరంగా వెతికినవి 1. స్ట్రీ 22. కల్కి 2898 A D3. 12వ ఫెయిల్4. లాపతా లేడీస్5. హను-మాన్6. మహారాజా7. మంజుమ్మెల్ బాయ్స్8. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్9. సలార్10. ఆవేశం వీటితోపాటు హిరమండి, మీర్జాపూర్, ది లాస్ట్ ఆఫ్ అస్, బిగ్ బాస్ 17, పంచాయత్ వంటి వెబ్ సిరీస్‌లు, టీవీ షోల కోసం వెతికారు. ట్రావెలింగ్ విషయానికి వస్తే.. 1. అజర్‌బైజాన్2. బాలి3. మనాలి4. కజాఖ్స్తాన్5. జైపూర్6. జార్జియా7. మలేషియా8. అయోధ్య9. కాశ్మీర్10. దక్షిణ గోవా ఫుడ్ ఐటమ్స్ 1. మామిడికాయ పచ్చడి2. కంజి3. చరణామృతం4. కొత్తిమీర పంజిరి5. ఉగాది పచ్చడిశంకర్పాలి కోసం తరచుగా Z జెనరేషన్ యువత కూడా సెర్చ్ చేసిందని గూగుల్ తెలిపింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఫ్లిప్‌కార్ట్ ను ఎక్కువగా సెర్చ్ చేశారంట ఈ సంవత్సరం ఇండియన్స్.