SC Reservation Verdict: మతం మారితే రిజర్వేషన్లు రద్దు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

మత మార్పిడి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇతర మతాల్లోకి మారినప్పుడు వారి రిజర్వేషన్ హక్కుల కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక వివరణ ఇచ్చింది.

New Update
Supreme Court Allows Parents To Evict Children From Property If They Don’t Care For Them

SC Reservation Verdict

SC Reservation Verdict: మత మార్పిడి కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇతర మతాల్లోకి మారినప్పుడు వారి రిజర్వేషన్ హక్కుల కొనసాగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక వివరణ ఇచ్చింది. ముఖ్యంగా క్రైస్తవ మతంలోకి మారిన వారు ఎస్సీలకు లభించే రాజ్యాంగపరమైన లబ్ధిని, రక్షణలను పొందలేరని కోర్టు స్పష్టం చేసింది.

Also Read: 'ధురంధర్ 2' మేకింగ్ హిస్టరీ.. వీక్‌డేస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి, గత పదేళ్లుగా పాస్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే, తనపై జరిగిన ఒక దాడికి సంబంధించి ఆయన 'ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం' కింద కేసు నమోదు చేశారు. దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపి, మతం మారిన వ్యక్తికి ఎస్సీ హక్కులు ఉండవని తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సదరు వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Also Read: కాంబో సెట్..! ధురంధర్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ..?

జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా కోర్టు ఈ క్రింది అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.

Also Read: మాట మార్చిన ట్రంప్.. ఇరాన్‌పై ఆగని బాంబుల వర్షం: మిడిల్ ఈస్ట్‌లో భీకర యుద్ధం!

రాజ్యాంగ ఉత్తర్వు 1950: రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు (1950) ప్రకారం.. హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులు.

హక్కుల కోల్పోవడం: ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం వంటి ఇతర మతాల్లోకి మారిన తక్షణమే వారి ఎస్సీ హోదా రద్దవుతుంది. తద్వారా వారు ఎస్సీ రిజర్వేషన్లు లేదా ఎస్సీ/ఎస్టీ చట్టం కింద లభించే రక్షణలను క్లెయిమ్ చేయలేరు.

హైకోర్టు తీర్పు సమర్థన: ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధంగా ఉందని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈ తీర్పు ద్వారా మతమార్పిడి చేసుకున్న వారికి రాజ్యాంగపరమైన రిజర్వేషన్ల విషయంలో ఉన్న సందిగ్ధతకు తెరపడినట్లయింది.డ

Advertisment
తాజా కథనాలు