/rtv/media/media_files/2026/03/22/sri-lanka-raises-fuel-prices-2026-03-22-21-23-41.jpg)
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సామాన్యుడిపై పిడుగులా పడుతోంది. వార్ ఎఫెక్ట్ అన్నీ దేశాలపై పడుతోంది. అంతర్జాతీయంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి డీజిల్, పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇంధన సెగలు సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం ఆదివారం (మార్చి 22) ఇంధన ధరలను ఏకంగా 25 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లోనే ఈ ధరలు పెరగడం ఇది రెండోసారి. యుద్ధం ఎఫెక్ట్ రానున్న రోజుల్లో ఇండియాపై కూడా పడే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోడానికి కేంద్ర కేబినెట్ ప్రధాని అధ్యక్షత ఈరోజు ఎమర్జెన్సీ భేటి జరిగింది. భారత్‌లో-- ఇప్పటికే గ్యాస్, పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి.
దీంతో శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. సాధారణ పెట్రోల్ లీటరుకు రూ.81 పెరగడంతో, పాత ధర రూ. 317 నుండి రూ. 398కి చేరింది. డీజిల్ లీటరుకు రూ.79 పెరిగి, రూ.303గా ఉన్నది.. రూ.382 కి చేరుకుంది. అలాగే సూపర్ డీజిల్ ధర రూ.443కు పెరగ్గా, కిరోసిన్ ధర కూడా భారీగా పెరిగి రూ.255 కు చేరింది.
యుద్ధం - ఆర్థిక సంక్షోభం
పశ్చిమాసియాలో యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్ల మార్కును దాటాయి. చమురు అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడే శ్రీలంకకు ఇది పెద్ద దెబ్బగా మారింది. 2022 నాటి తీవ్ర ఆర్థిక సంక్షోభం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ దేశానికి, ఈ తాజా పరిణామాలు గడ్డుకాలాన్ని గుర్తు చేస్తున్నాయి.
పెరుగుతున్న డిమాండ్‌ను అదుపు చేయడానికి అధ్యక్షుడు అనురా కుమార దిస్సానాయకే కీలక ఆదేశాలు జారీ చేశారు.
పనిదినాల తగ్గింపు: ఇంధనాన్ని ఆదా చేసేందుకు వారానికి 4 పనిదినాలను మాత్రమే అమలు చేస్తున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్: ఉద్యోగులకు మళ్ళీ ఇంటి నుండే పనిచేసే వెసులుబాటు కల్పించాలని సంస్థలను కోరారు.
క్యూఆర్ కోడ్ విధానం: ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు క్యూఆర్ కోడ్ ద్వారా రేషనింగ్ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కార్లకు వారానికి 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్ల పరిమితిని విధించారు.
ఇంధన ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం మరో 5-8 శాతం పెరిగే ప్రమాదం ఉందని అంచనా.
Follow Us