/rtv/media/media_files/2026/03/26/operation-urja-suraksha-2026-03-26-12-35-32.jpg)
పశ్చిమ ఆసియాలో ముదురుతున్న యుద్ధం ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రాంతంలో అస్థిరత నెలకొంది. ఇది భారతదేశ ఇంధన భద్రతకు సవాలుగా మారింది. ఈ క్రమంలో ఇండియా తన క్రూడ్ ఆయిల్ షిప్‌లను కాపాడుకునేందుకు రంగంలోకి దిగింది. ఇంధన భద్రతకోసం ఇండియన్ నేవీ వ్యూహాత్మకమైన ఆపరేషన్ ఊర్జా సురక్షను ప్రారంభించింది. ముడి చమురు, ఎల్‌ఎన్‌జి, ఎల్‌పీజీ వంటి నిత్యావసర ఇంధన సరుకులను భారత్‌కు చేరవేయడంలో 'ఆపరేషన్ ఊర్జా సురక్ష' కీలక పాత్ర పోషిస్తోంది.
STORY | India among 5 nations granted passage through Strait of Hormuz by Tehran
— Press Trust of India (@PTI_News) March 26, 2026
Iran allowed India and a number of other "friendly nations", including China and Russia, to use the Strait of Hormuz for commercial shipping, Iranian Foreign Minister Seyed Abbas Araghchi has said.… pic.twitter.com/eO3WBfGpLH
సముద్ర మార్గంలో భారత యుద్ధనౌకల గస్తీ
ఈ ఆపరేషన్ కోసం భారత నౌకాదళం ఐదుకు పైగా అగ్రశ్రేణి యుద్ధనౌకలను (డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు) రంగంలోకి దించింది. ఇరాన్ నియంత్రణలో ఉన్న హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ సరుకు రవాణా నౌకలకు రక్షణ కల్పించడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం నెలకొన్న ఘర్షణలతో సుమారు 20 సరుకు రవాణా నౌకలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోవడంతో, వాటిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి నేవీ మల్టీ లెవల్ సెక్యురిటీ ఏర్పాటు చేసింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన దేశ ప్రయోజనాలను, పౌరుల ప్రాణాలను కాపాడుకోవడంలో భారత నౌకాదళం చూపిస్తున్న తెగువ అభినందనీయం.
రక్షణ కవచంలా భారత నావికాదళం
ఒమన్ గల్ఫ్‌లో మోహరించిన భారత యుద్ధనౌకలు, హోర్ముజ్ జలసంధి దాటి వస్తున్న నౌకలను అరేబియా సముద్రం వైపు సురక్షితంగా మళ్లించే బాధ్యతను తీసుకున్నాయి. ఇరాన్ జలాల్లో తనిఖీలు ముగించుకుని బయటకు వచ్చే భారత నౌకలతో నావికాదళం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. "జలసంధిలో ఇరాన్ నీటి అడుగున మందుపాతరలను అమర్చిందని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ ముప్పును తప్పించుకుంటూ, కేవలం సురక్షిత మార్గాల ద్వారానే భారతీయ సిబ్బంది ఉన్న నౌకలను మన నావికాదళం గైడ్ చేస్తోంది."
ఈ ఆపరేషన్ ఇప్పటికే గణనీయమైన విజయాన్ని సాధించింది. 'పైన్ గ్యాస్', 'జగ్ వసంత్' అనే రెండు భారీ LPG వాహక నౌకలు నౌకాదళ రక్షణతో ప్రమాదకర ప్రాంతాన్ని దాటాయి. ఈ రెండు నౌకలు కలిసి సుమారు 92,000 టన్నుల ఎల్పీజీని మోసుకెళ్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఇవి భారత ఓడరేవులకు చేరుకోనున్నాయి.
Follow Us