/rtv/media/media_files/2026/03/12/farooq-abdullah-2026-03-12-06-43-49.jpg)
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లాకు పెను ప్రమాదం తప్పింది. జమ్మూలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరపాడు. బుధవారం రాత్రి జమ్మూలోని గ్రేటర్ కైలాష్‌లో ఒక వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఫరూఖ్ అబ్దుల్లాతో పాటు జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి సురీందర్ చౌదరి, ముఖ్యమంత్రి సలహాదారు నాసిర్ అస్లాం వాని తదితర ప్రముఖులు హాజరయ్యారు. వేడుక ముగించుకుని వారు బయటకు వస్తుండగా ఒక దుండగుడు ఫరూఖ్ అబ్దుల్లా టార్గెట్‌గా పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరిపాడు.
#WATCH | Jammu, J&K: An incident of firing occurred at a function where JKNC chief Farooq Abdullah and Deputy CM Surinder Choudhary were present. One person has been arrested. No injuries have been reported.
— ANI (@ANI) March 11, 2026
CCTV visuals showing the moment when the incident took place. pic.twitter.com/pnoD3f9fRJ
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది
కాల్పులు జరిగిన వెంటనే అప్రమత్తమైన ఫరూఖ్ అబ్దుల్లా వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. నిందితుడు రెండవ రౌండ్ కాల్పులు జరపకుండానే సెక్యురిటీ అతడిని బంధించి కింద పడేశారు. ఈ పెనుగులాటలో ఫరూఖ్ అబ్దుల్లాకు ఎలాంటి గాయాలు కాలేదు, ఆయన క్షేమంగా బయటపడ్డారు. అయితే, డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
నిందితుడి వివరాలు
పోలీసులు నిందితుడిని కమల్ సింగ్ జమ్వాల్‌గా గుర్తించారు. ఇతడు జమ్మూలోని పురాణీ మండి నివాసి అని, మైనింగ్ వ్యాపారంలో ఉన్నాడని సమాచారం. ఘటన సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడు ఉపయోగించిన తుపాకీ లైసెన్స్ కలిగినదేనని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో స్పందించారు. "అల్లా దయవల్ల నా తండ్రి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. Z+ కేటగిరీ భద్రత ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇంత దగ్గరగా నిందితుడు ఎలా రాగలిగాడనేది ఆందోళనకరం. ఇది తీవ్రమైన భద్రతా వైఫల్యం." అని ఆయన పేర్కొన్నారు.
Attack on Farooq Abdullah at Jammu wedding: The accsued has been identified as Kamal Singh Jamwal. Apprehended, motive behind the attack yet to ascertained. https://t.co/0pkWUYqaUIpic.twitter.com/P8xU6FxSLG
— Piyush Rai (@Benarasiyaa) March 11, 2026
డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిఐపిలు ఉన్న చోట స్థానిక పోలీసులు తగిన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా లేక వ్యక్తిగత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us