కేరళ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మహిళల శరీరాకృతిపై మాట్లాడినా లైంగిక వేధింపుతో సమానమని తీర్పు వెలువరించింది. మహిళల శరీర ఆకృతి గురించి ఎవరూ కామెంట్ చేసినా దానిని లైంగిక వేధింపుగా పరిగణించాలంటూ కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. తనపై ఓ మహిళా ఉద్యోగి దాఖలు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి ఆర్.రామచంద్రన్ నాయర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అతని పిటిషన్ ను తోసిపుచ్చుతూ జస్టిస్ ఎ బదరుద్దీన్ ఈ తీర్పు వెలువరించారు. 2013 నుంచి నిందితుడు తనపై అసభ్య పదజాలం వాడారని, ఆపై 2016-17లో తనకు అభ్యంతరకర సందేశాలు, వాయిస్ కాల్స్ పంపడం ప్రారంభించారని మహిళ తన పిటిషన్ లో ఆరోపించింది. అతనిపై కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డు, పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ, అతను తనకు అభ్యంతరకరమైన సందేశాలను పంపుతూనే ఉన్నాడని ఆమె పేర్కొంది. ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసినప్పటికీ, ఇతర నంబర్‌ల నుండి కూడా తనకు లైంగికంగా సూచించే సందేశాలు పంపినట్లు ఆమె చెప్పింది. వాదనలతో ఏకీభవించని కోర్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఆరోపణలు సెక్షన్లు 354A(1)(iv), 509 IPC లేదా సెక్షన్ 120(o) కేరళ పోలీస్ చట్టం ప్రకారం నేరాలుగా పరిగణించబడవని.. ఒకరి శరీర నిర్మాణాన్ని సూచించే వాటిని లైంగిక వేధింపుల వ్యాఖ్యలుగా వర్గీకరించలేమని పేర్కొన్నారు. నిందితుల వాదనలతో ఏకీభవించని కోర్టు.. ఏ వ్యక్తి అయినా స్త్రీని ఉద్దేశించి లైంగిక రంగుల కామెంట్స్ చేస్తే లైంగిక వేధింపుల నేరానికి పాల్పడినట్లేనని తీర్పును వెల్లడించింది. ఐపిసి సెక్షన్ 354ఎ, 509, కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 120 (ఓ) కింద నేరానికి సంబంధించిన అంశాలు ప్రాథమికంగా కనిపిస్తున్నాయని పేర్కొంది. కేసు వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ప్రాథమికంగా ప్రాసిక్యూషన్ కేసు ఆరోపించబడిన నేరాలను ఆకర్షించడానికి రూపొందించబడిందని స్పష్టమవుతుందని కోర్టు జనవరి 6న తన ఉత్తర్వుల్లో పేర్కొంది. Also Read : దెబ్బలు పడ్డాయి రోయ్ ... రమేశ్ బిధూడీ టికెట్ ఊస్ట్ !