BREAKING: కేంద్రం వలస కూలీలకు వరం.. ఫ్రీగా LPG గ్యాస్ సిలిండర్లు పంపిణీ!

గ్యాస్ కొరత నుంచి వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వలస కార్మికులకు 5 కిలోల LPG సిలిండర్లను ఉచితంగా అందజేయనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు కేంద్రం లేఖలు రాసింది.

New Update
_Central Govt

గ్యాస్ కొరత కష్టాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్న వలస కార్మికులకు 5 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిశ్చయించింది. ఈ పథకం ద్వారా కూలీల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా, వారికి వంట ఇంధనం కోసం అయ్యే ఖర్చును తగ్గించడం ప్రభుత్వ ఉద్దేశ్యం.

ఈ నిర్ణయం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అధికారిక లేఖలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అర్హులైన వలస కూలీలను గుర్తించి, ఈ నెలాఖరు నుంచే సరఫరాను ప్రారంభించనున్నారు. వలస కూలీలకు 5 కిలోల సిలిండర్లు పూర్తి ఉచితంగా లభిస్తాయి. ఈ నెల 23వ తేదీ నుండి అన్ని రాష్ట్రాలకు సిలిండర్ల సరఫరా ప్రక్రియ మొదలవుతుంది. అలాగే.. వ్యాపార అవసరాల కోసం వాడే కమర్షియల్ సిలిండర్ల సరఫరాను కూడా 20% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల హోటళ్లు, చిన్న చిన్న వ్యాపార సంస్థలకు గ్యాస్ కొరత తీరనుంది.

నిత్యం ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే కార్మికులకు, పెద్ద సిలిండర్లు మోయడం కష్టంగా ఉంటుంది. అందుకే 5 కిలోల చిన్న సిలిండర్లను ప్రభుత్వం ఎంచుకుంది. ఇది వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది.

Advertisment
తాజా కథనాలు