/rtv/media/media_files/2026/03/18/lpg-gas-atms-2026-03-18-18-39-27.jpg)
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా LPG సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద కిలోమీటర్ల మేర క్యూలైన్లు, రోజుల తరబడి నిరీక్షణతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వినూత్నమైన 'LPG Gas ATM'లను అందుబాటులోకి తీసుకువచ్చింది. బ్యాంకు ఏటీఎం తరహాలోనే పనిచేసే ఈ మెషిన్‌తో వినియోగదారులు ఎప్పుడైనా గ్యాస్ సిలిండర్‌ను పొందవచ్చు.
Amid an LPG shortage linked to tensions involving the United States, Israel, and Iran, a new facility has been introduced in Gurugram. North India’s first LPG gas ATM has been launched, allowing residents to get a filled cylinder in just 2–3 minutes without long waits.
— DNA (@dna) March 18, 2026
The smart… pic.twitter.com/AkfuWzioQz
ఎల్‌పీజీ ATM
ఇది భారత్ గ్యాస్ ద్వారా ప్రవేశపెట్టిన ఒక ఆటోమేటెడ్ వెండింగ్ మెషిన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పనిచేసే ఈ యంత్రాలు 24x7 అందుబాటులో ఉంటాయి. అంటే రాత్రి 2 గంటలకైనా సరే, మీరు నిండు సిలిండర్‌ను ఇంటికి తీసుకెళ్లవచ్చు. 2025లో బెంగళూరు, గురుగ్రామ్‌లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ సేవలు, ఇప్పుడు ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, జైపూర్ వంటి నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఇవి విస్తరించనున్నాయి.
సిలిండర్ పొందే విధానం
ఈ ప్రక్రియ కేవలం 2-3 నిమిషాల్లో పూర్తవుతుంది. ఇది పూర్తిగా డిజిటల్, కాంటాక్ట్‌లెస్ విధానం. ఏటీఎం మెషిన్ వద్దకు వెళ్లి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. మీ మొబైల్‌కు వచ్చే OTP ద్వారా లాగిన్ అవ్వాలి. (మీ భారత్ గ్యాస్ కనెక్షన్ దీనికి లింక్ అయి ఉండాలి). మీ దగ్గర ఉన్న ఖాళీ సిలిండర్‌పై ఉన్న బార్‌కోడ్ లేదా QR కోడ్‌ను మెషిన్ వద్ద స్కాన్ చేయాలి. UPI (Google Pay, PhonePe) లేదా డెబిట్ కార్డ్ ద్వారా డిజిటల్ పేమెంట్ చేయాలి. పేమెంట్ పూర్తయ్యాక, మెషిన్ మీ ఖాళీ సిలిండర్‌ను లోపలికి తీసుకుని, ఆటోమేటిక్‌గా నిండు సిలిండర్‌ను బయటకు ఇస్తుంది.
సిలిండర్ రకం: ప్రస్తుతం ఈ ఏటీఎంలు కేవలం కాంపోజిట్ సిలిండర్లను (లైట్‌వెయిట్ ఫైబర్ గ్లాస్) మాత్రమే అంగీకరిస్తాయి. సాధారణ స్టీల్ సిలిండర్లకు ఇవి సపోర్ట్ చేయవు. నేరుగా మీ బ్యాంక్ ఖాతాకే గ్యాస్ సబ్సిడీ జమ అవుతుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం కేవలం భారత్ గ్యాస్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇండేన్, హెచ్‌పీ (HP) గ్యాస్ వినియోగదారులకు ఇంకా ప్రారంభం కాలేదు.
ప్రయోజనాలు:
గ్యాస్ ఏజెన్సీలతో పనిలేకుండా, క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు.
రవాణా ఆలస్యాలు, సరఫరా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
24 గంటల సేవలు అందుబాటులో ఉండటం వల్ల అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగకరం.
యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిన తరుణంలో, ఇటువంటి అత్యాధునిక సాంకేతికత సామాన్యులకు పెద్ద ఊరటనిస్తోంది. మీ ప్రాంతంలో ఈ ఏటీఎం ఉందో లేదో తెలుసుకోవడానికి భారత్ గ్యాస్ యాప్‌ను చెక్ చేయవచ్చు.
Follow Us