Delhi Fire Accident : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం: ముగ్గురు పిల్లలతో సహా ఆరుగురు మృతి!

దేశ రాజధాని ఢిల్లీలోని నైరుతి ప్రాంతం పాలం వద్ద బుధవారం ఉదయం ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

New Update
delhi

దేశ రాజధాని ఢిల్లీలోని నైరుతి ప్రాంతం పాలం వద్ద బుధవారం ఉదయం ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 7 గంటల సమయంలో మంటలు చెలరేగగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ భవనంలో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు నాలుగు అంతస్తులు ఉన్నాయి.

10 మందిని రక్షించి

బేస్మెంట్,  మొదటి అంతస్తులను బట్టలు, కాస్మెటిక్స్ నిల్వ చేసే గోడౌన్లుగా వాడుతుండగా, రెండు, మూడు అంతస్తుల్లో ప్రజలు నివసిస్తున్నారు. ఇరుకైన ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడింది. ఇప్పటివరకు సుమారు 10 మందిని రక్షించి వివిధ ఆసుపత్రులకు తరలించారు.ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఆమె, ఈ ప్రమాదంపై మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అగ్నిమాపక,  రక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు