/rtv/media/media_files/2026/03/20/matthieu-ricard-2026-03-20-19-26-32.jpg)
సాధారణంగా సంపద పెరిగితే సంతోషం పెరుగుతుందని అందరూ భావిస్తారు. కానీ, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, మనసు నిండా ప్రశాంతతతో 'ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన వ్యక్తి'గా నిలిచారు మాథ్యూ రిచర్డ్. 1946లో ఫ్రాన్స్‌లో జన్మించిన ఈయన జీవిత ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
సైంటిస్ట్ నుండి సన్యాసిగా..
మాథ్యూ రిచర్డ్ తల్లిదండ్రులు తత్వశాస్త్ర బోధకులు. ఆయన స్వయంగా మాలిక్యులర్ జెనెటిక్స్‌లో పీహెచ్‌డీ (PhD) పూర్తి చేశారు. అంతటి ఉన్నత చదువు చదివినప్పటికీ, ఆయనకు భౌతిక ప్రపంచంలో సంతోషం దొరకలేదు. ఆ ఆనందం కోసమే తన కెరీర్‌ను వదిలి టిబెట్‌కు చేరుకున్నారు. అక్కడ బౌద్ధ మతాన్ని స్వీకరించి, దలైలామాకు ఫ్రెంచ్ అనువాదకుడిగా సేవలందించారు.
శాస్త్రీయంగా నిరూపితమైన ఆనందం
ఐక్యరాజ్యసమితి 2016 హ్యాపీనెస్ రిపోర్ట్‌లో మాథ్యూను అత్యంత సంతోషకరమైన వ్యక్తిగా ప్రకటించింది. ఇది కేవలం మాటలతో చెప్పింది కాదు, శాస్త్రవేత్తలు ఆయన మెదడుపై 12 ఏళ్ల పాటు సుదీర్ఘ పరిశోధనలు చేసి నిర్ధారించారు.
256 సెన్సార్లు: విస్కాన్సిన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు మాథ్యూ మెదడుకు 256 సెన్సార్లను అమర్చి ఆయన ధ్యాన స్థితిని గమనించారు.
గామా కిరణాలు: ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు మెదడులో అసాధారణ స్థాయిలో 'గామా కిరణాలు' ఉత్పత్తి అవుతున్నాయని, ఇవి ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తికి సంకేతాలని గుర్తించారు.
ప్రీఫ్రంటల్ కార్టెక్స్: మెదడులోని ఎడమ భాగం అత్యంత చురుకుగా ఉండటం వల్ల, ఆయనలో ప్రతికూల ఆలోచనలకు తావులేకుండా నిరంతర ఆనందం వెల్లివిరుస్తోందని శాస్త్రవేత్తలు తేల్చారు.
1991 నుండి విచారం లేదు
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 1991 నుండి మాథ్యూ రిచర్డ్ ఒక్క క్షణం కూడా విచారంగా లేరని పరిశోధనలు చెబుతున్నాయి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆయన మెదడు సానుకూలంగానే స్పందిస్తోంది. ధ్యానం ద్వారా మనసును ఎలా అదుపులో ఉంచుకోవచ్చో, సంతోషం అనేది బయట దొరికే వస్తువు కాదు.. అది మన లోపలే ఉంటుందని మాథ్యూ ప్రపంచానికి చాటి చెప్తున్నారు.
Follow Us