LPG Crisis: వంటకు గ్యాస్ సిలిండర్లు దొరకడం లేదా? అయితే.. ఈ 4 బెస్ట్ ఆప్షన్లను ట్రై చేయండి!

ఈ సంక్షోభ సమయంలో గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఉపయోగించే మరికొన్ని అప్షన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటి ద్వారా ప్రజలు గ్యాస్ కొరత ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. 

New Update
india lpg crisis

india lpg crisis

LPG Crisis:  యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధనం సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో భారతదేశం కూడా వంట గ్యాస్ సిలిండర్ల కొరతను ఎదుర్కుంటోంది. సిలిండర్ల పంపిణీ ఆగిపోవడంతో అటు సామాన్య జనం, ఇటు ఫుడ్ బిజినెస్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ముందుగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడగా.. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సరఫరా కూడా నిలిచిపోయింది. బుక్ చేసి వారమైన సిలిండర్లు ఇంటికి రావడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరతతో ఇప్పటికే పలు హాస్టళ్లు, హోటల్స్, రెస్టారెంట్స్ మూత పడగా.. మరికొందరు ప్రత్యాన్మయ మార్గాలను ఎంచుకుంటున్నారు.  పలు రెస్టారెంట్స్ గ్యాస్ కు బదులుగా కట్టెల పొయ్యి పై వంటలు చేస్తున్నారు. 

ఈ సంక్షోభ సమయంలో గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఉపయోగించే మరికొన్ని వంట పద్దతుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటి ద్వారా ప్రజలు గ్యాస్ కొరత ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. 

ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్

ప్లెయిన్ రైస్ నుంచి బిర్యానీ వరకు అన్ని రకాల వంటకాల్ని ఈ ఎలక్ట్రిక్ ప్రెజర్ కుక్కర్ వండుకోవచ్చు. ఇది గ్యాస్ ఆదా చేయడంతో పాటు వంట సమయాన్ని కూడా తగ్గిస్తుంది. అన్నం వండడం, కూరగాయలు, గుడ్లు ఉడకబెట్టడం ఇలా మల్టీ పర్పస్ గా దీనిని వాడుకోవచ్చు. 

బయో గ్యాస్ 

ఆవు పేడ, వంట గది వ్యర్థాల నుంచి బయో గ్యాస్ తయారవుతుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఇది ఉచిత ఇంధనాన్ని అందిస్తుంది. పశువులు ఉన్నవారికి ఇదొక మంచి ఆప్షన్ 

ఇండక్షన్ స్టవ్స్

ఇండక్షన్ స్టవ్స్ గ్యాస్ సిలిండర్లకు ఒక ఉత్తమమైన ప్రత్యామ్నాయ మార్గం. వీటికి ఇంధనంతో పనిలేదు. కేవలం పవర్ ఉంటే సరిపోతుంది. అంతేకాదు ఇవి గ్యాస్ పొయ్యిల కంటే 50 % వేగంగా కూడా పనిచేస్తాయి. వీటి ధర రూ. 1200 నుంచి 1400 వరకు ఉంటుంది. అనేక బ్రాండ్లలో అందుబాటులో ఉంటాయి. 

సోలార్ స్టవ్స్

వీటికి గ్యాస్, ఎలక్ట్రిసిటీ రెండూ అవసరం లేదు. కేవలం సూర్యకాంతితో ఇంధనం ఉత్పత్తి అవుతుంది. సోలార్ స్టవ్స్ వినియోగం ద్వారా డబ్బు కూడా ఆదా అవుతుంది. 

Advertisment
తాజా కథనాలు