హోర్ముజ్ వద్ద ఫేస్ టూ ఫేస్ వార్.. రంగంలోకి 2,000 మెరైన్లను దింపిన ట్రంప్

ప్రపంచ దేశాల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 2,000 మంది మెరైన్ సైనికులతో యుద్ధనౌకను మధ్యప్రాచ్యానికి తరలిస్తున్నట్లు పెంటగాన్ ప్రకటించింది.

New Update
_USS Tripoli

పశ్చిమ ఆసియాలో యుద్ధం మరింత ముదిరింది. ప్రపంచ దేశాల చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోకుండా ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుమారు 2,000 మంది మెరైన్ సైనికులతో కూడిన 'యూఎస్ఎస్ ట్రిపోలి' యుద్ధనౌకను మధ్యప్రాచ్యానికి తరలిస్తున్నట్లు పెంటగాన్ ప్రకటించింది.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతోపాటు వాటి మిత్ర దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై కాకుండా నౌకలను బ్లాస్ట్ చేస్తోంది. అమెరికా ఆంక్షలు, ఇటీవల జరిగిన దాడుల కారణంగా ఇరాన్ ఇలాగే ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. దీనిని అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రంప్ నేరుగా సైనిక చర్యకు మొగ్గు చూపారు.

USA ట్రిపోలి ప్రత్యేకతలేంటి?

భారీ సామర్థ్యం: యూఎస్ఎస్ ట్రిపోలి అనేది ఒక భారీ యాంఫిబియస్ అస్సాల్ట్ షిప్. ఇది యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, క్షిపణులను మోసుకెళ్లగలదు.
మెరైన్ల మోహరింపు: ఈ నౌకలో ఉన్న 2,000 మంది మెరైన్ సైనికులు సముద్రం నుండి నేరుగా భూతలంపైకి దాడులు చేయడంలో ఆరితేరిన వారు.

వ్యూహాత్మక రక్షణ: హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడం, ఇరాన్ నౌకాదళం నుండి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడం వీరి ప్రధాన బాధ్యత.

ట్రంప్ వార్నింగ్

"ప్రపంచ వాణిజ్యాన్ని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు. అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడం" అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మోహరింపు కేవలం రక్షణ కోసం మాత్రమే కాదని, అవసరమైతే ఎదురుదాడికి కూడా సిద్ధమని ఇరాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.

ఇరాన్ స్పందన

మరోవైపు ఇరాన్ ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తోంది. విదేశీ సైన్యం తమ సరిహద్దుల వద్ద మోహరించడం ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని, ఏవైనా దాడులు జరిగితే తాము గట్టిగా సమాధానం ఇస్తామని టెహ్రాన్ హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు