మిలిటరీ హెలికకాప్టర్ కూలి ఆరుగురు మృతి.. మరో జవాన్ గల్లంతు

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ఖతార్‌లో ఓ విషాదం చోటుచేసుకుంది. ఖతార్ సాయుధ దళాలకు చెందిన ఒక మిలిటరీ హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరొక వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

New Update
_helicopter crash

మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ఖతార్‌లో ఓ విషాదం చోటుచేసుకుంది. ఖతార్ సాయుధ దళాలకు చెందిన ఒక మిలిటరీ హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరొక వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఈ హెలికాప్టర్ తన సాధారణ విధుల్లో భాగంగా గస్తీలో ఉండగా అకస్మాత్తుగా టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. దీంతో అది ఖతార్ ప్రాంతీయ జలాల్లో కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. తీరప్రాంత భద్రతా దళాలు, ప్రత్యేక సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతానికి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం కేవలం 'సాంకేతిక లోపం' కారణంగానే జరిగిందని రక్షణ శాఖ స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రాంతంలో యుద్ధం జరుగుతుండగా ఈ ప్రమాదం జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన కొన్ని వారాలుగా ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ దళాల మధ్య ఘర్షణలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఖతార్‌లోని కీలక ఇంధన కేంద్రాలపై కూడా దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ హెలికాప్టర్ కూలిపోవడానికి శత్రువుల దాడులతో ఎలాంటి సంబంధం లేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

సహాయక చర్యలు
ఖతార్ కోస్ట్ గార్డ్, ఇతర రక్షణ విభాగాలు ఘటనా స్థలంలో మోహరించాయి. గల్లంతైన వ్యక్తి కోసం డ్రోన్లు, అత్యాధునిక సెన్సార్లతో కూడిన పడవలను రంగంలోకి దించారు. మరణించిన వారి వివరాలను మరియు వారి జాతీయతను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సంఘటన పట్ల ఖతార్ ప్రభుత్వం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది.

Advertisment
తాజా కథనాలు