/rtv/media/media_files/2026/03/12/mojtaba-khamenei-2026-03-12-08-42-28.jpg)
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై షాకింగ్ వార్తలు వస్తున్నాయి. మార్చి 8న ఆయన్ని మత గురువులు ఇరాన్ సుప్రీం లీడర్‌గా ప్రకటించారు. అయినా ఆయన ఇప్పటి వరకు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడటం, ఎలాంటి వీడియోలు కానీ రిలీజ్ చేయలేదు. దీంతో అసలు ఆయన ఉన్నారా, ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశం శత్రువులతో యుద్ధం చేస్తుంటే కొత్త నాయకుడు అజ్ఞాతంలో ఉండటం ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో, అంతర్జాతీయ వేదికపై ఉత్కంఠ రేపుతోంది.
Iran’s new Supreme Leader, Mojtaba Khamenei, has not been seen or heard from publicly since his appointment over the weekend and was reportedly injured in the same U.S. or Israeli strike that killed his father and predecessor on the first day of the war.
— Breaking911 (@Breaking911) March 11, 2026
pic.twitter.com/gig6y26uGZ
ఫిబ్రవరి 28న ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి కారణమైన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌లోని సుప్రీం నేత నివాస సముదాయంపై జరిగిన భీకర దాడిలో అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సమయంలో అక్కడే ఉన్న మొజ్తాబా ఖమేనీ కాళ్లు, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ దాడిలో మొజ్తాబా భార్య, కుమారుడు కూడా మరణించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
అజ్ఞాతంలో ఉండటానికి కారణం?
మార్చి 8న మొజ్తాబాను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించినప్పటికీ, ఆయన ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం లేదా వీడియోలు రిలీజ్ చేయకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. దీనిపై వివరణ ఇస్తూ సైప్రస్‌లోని ఇరాన్ రాయబారి అలీరెజా సలారియన్, మొజ్తాబా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం ఆయన ప్రసంగించే స్థితిలో లేరని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆయన కాళ్లకు ఫ్రాక్చర్ అవ్వడం, ముఖంపై గాయాల కారణంగానే బయటకు రావడం లేదని తెలుస్తోంది.
ప్రభుత్వ స్పందన
ఇరాన్ అధ్యక్షుడి కుమారుడు, ప్రభుత్వ సలహాదారు యూసెఫ్ పెజెష్కియన్ ఈ వార్తలపై స్పందిస్తూ, "మొజ్తాబా గాయపడిన మాట వాస్తవమే అయినా, ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని" టెలిగ్రామ్ ద్వారా తెలిపారు. ఇరాన్ అధికారిక మీడియా కూడా ఆయన్ను "రంజాన్ యుద్ధంలో గాయపడిన యోధుడు" అని అభివర్ణించింది. కాళ్లు, చేతులు, ముఖానికి బాగా గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తసుకుంటున్నారు. తండ్రి అలీ ఖమేనీ, తల్లి, భార్య, ఒక కుమారుడు అదే దాడిలో చనిపోయాడు. ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని, సురక్షిత ప్రాంతంలో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్తున్నారు.
Follow Us