అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్ IRGC ఆఫీసర్ హతం

శుక్రవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని మెయిన్ టార్గెట్‌లపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో నైనీ ప్రాణాలు కోల్పోయినట్లు IRGC తన ప్రకటనలో పేర్కొంది. నైనీ మరణాన్ని "అమెరికా-జియోనిస్ట్ శక్తులు చేసిన పిరికిపంద చర్య"గా ఇరాన్ అభివర్ణించింది.

New Update
_General Ali Mohammad Naeini

మధ్యప్రాచ్యంలో యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. ఇరాన్‌కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇరాన్ పవర్ ఫుల్ ఆర్మీ వింగ్ 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) అధికార ప్రతినిధి నిన్న అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ రోజు ఆయన (బ్రిగేడియర్ జనరల్ అలీ మహమ్మద్ నైనీ) అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన జాయింట్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లో మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ శుక్రవారం అధికారికంగా ధృవీకరించింది.

శుక్రవారం తెల్లవారుజామున టెహ్రాన్‌లోని మెయిన్ టార్గెట్‌లపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో నైనీ ప్రాణాలు కోల్పోయినట్లు IRGC తన ప్రకటనలో పేర్కొంది. నైనీ మరణాన్ని "అమెరికా-జియోనిస్ట్ శక్తులు చేసిన పిరికిపంద చర్య"గా ఇరాన్ అభివర్ణించింది. అయితే, ఈ దాడులపై ఇటు అమెరికా గానీ, అటు ఇజ్రాయెల్ గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటల్లోనే..

చిత్రమైన విషయం ఏమిటంటే, మరణించడానికి కొన్ని గంటల ముందే నైనీ పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ నౌకాదళం నాశనమైందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. "ధైర్యముంటే అమెరికా తన యుద్ధ నౌకలను పర్షియన్ గల్ఫ్‌లోకి పంపాలి" అంటూ ఆయన సవాల్ విసిరారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నా ఇరాన్ క్షిపణి ఉత్పత్తి ఏమాత్రం తగ్గలేదని, తమ క్షిపణి పరిశ్రమకు 100కు 100 మార్కులు వేయవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ఆయన మరణించడం సంచలనం రేకెత్తించింది.

ఇరాన్ నాయకత్వానికి వరుస దెబ్బలు
ఫిబ్రవరి 28న అయాతుల్లా అలీ ఖమేనీ మరణించినప్పటి నుండి ఇరాన్ నాయకత్వం వరుసగా కీలక నేతలను కోల్పోతోంది. ఈ వారంలోనే సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, బాసిజ్ కమాండర్ ఘోలామ్రెజా సులేమానీ, మరియు ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్ మరణించగా, ఇప్పుడు నైనీ మరణం ఇరాన్ ప్రచార యంత్రాంగానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

1957లో కాషాన్ లో జన్మించిన నైనీ, 2024 నుండి IRGC ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సైనిక వ్యూహకర్తగానే కాకుండా, ఇమామ్ హుస్సేన్ యూనివర్సిటీలో సోషల్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా కూడా ఆయన పనిచేశారు. ఆయన మరణం ఇరాన్ సైనిక మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన నింపింది.

Advertisment
తాజా కథనాలు