/rtv/media/media_files/2026/03/15/sejal-2-ballistic-missiles-2026-03-15-20-45-02.jpg)
పశ్చిమ ఆసియాలో యుద్ధంలో పరస్పర దాడులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన, అధునాతనమైన 'సెజిల్-2' బాలిస్టిక్ క్షిపణులను మొదటిసారిగా యుద్ధరంగంలోకి దించింది. ఇజ్రాయెల్, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌కు ఇరాన్ క్షిపణి సవాలు విసురుతోంది. రాడార్ల కళ్లుగప్పి టార్గెట్‌ను నాశనం చేయగలిగే ఈ క్షిపణుల వినియోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్'లో భాగంగా ఇరాన్ ఈ విధ్వంసకర ఆయుధాలను ప్రయోగించినట్లు తెలుస్తోంది.
🇮🇷 — VID: The IRGC claimed today that it launched a Sejjil ballistic missile at Israel for the first time during the current war.
— Belaaz News (@TheBelaaz) March 15, 2026
• The Sejjil is a long-range solid-fuel missile capable of reaching Israel in minutes and carrying a heavy warhead. pic.twitter.com/DOOIrB8DQv
'సెజిల్-2' ప్రత్యేకత?
ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 'సెజిల్' సిరీస్ క్షిపణులలో సెజిల్-2 అత్యంత ప్రమాదకరమైనది.
ఘన ఇంధన సాంకేతికత: పాత తరం ద్రవ ఇంధన క్షిపణులలా కాకుండా, సెజిల్-2 ఘన ఇంధనంతో పనిచేస్తుంది. దీనివల్ల వీటిని అతి తక్కువ సమయంలో (కేవలం నిమిషాల్లో) ప్రయోగించడానికి వీలవుతుంది. శత్రువుల గూఢచారి ఉపగ్రహాలకు కూడా వీటి ప్రయోగ సన్నాహాలు పసిగట్టడం కష్టమవుతుంది.
రాడార్లకు చిక్కని వ్యూహం: సెజిల్-2 క్షిపణులు గాలిలో ప్రయాణించేటప్పుడు వాటి దిశను వేగంగా మార్చుకోగలవు. వీటిని 'డ్యాన్సింగ్ మిస్సైల్స్' అని కూడా పిలుస్తారు. ఇవి ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్' లేదా 'ఆరో' వంటి రక్షణ వ్యవస్థలను బురిడీ కొట్టించగలవు.
భారీ పరిధి: సుమారు 2,000 నుండి 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇవి కచ్చితత్వంతో ఛేదించగలవు. అంటే ఇరాన్ నుండి నేరుగా ఇజ్రాయెల్‌లోని ఏ మూలనైనా ఇవి తాకగలవు.
🚨 🚀 🇮🇷 | L'Iran a utilisé pour la première fois le redoutable missile balistique Sejjil contre Israël.
— Arab Intelligence - المخابرات العربية (@Arab_Intel) June 18, 2025
Une portée de 2500 km pour toucher le cœur du territoire israélien directement depuis l'Iran. pic.twitter.com/q838OUPGZ7
యుద్ధంలో మొదటిసారి వినియోగం
ఇప్పటివరకు కేవలం పరీక్షలకే పరిమితమైన ఈ క్షిపణులను ప్రస్తుతం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలు, ఇంటెలిజెన్స్ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ క్షిపణులు ధ్వని కంటే 13 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలవని, దీనివల్ల వీటిని అడ్డుకోవడం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలకు తలకు మించిన భారంగా మారిందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వార్ ఈక్వేషన్స్ ఛేంజ్
సెజిల్-2 ప్రయోగంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా తన అత్యాధునిక 'థాడ్' క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్‌లో మోహరించినప్పటికీ, ఇరాన్ కొత్త టెక్నాలజీతో వాటిని సవాలు చేస్తోంది. ఈ పరిణామం కేవలం ఇరు దేశాలకే కాకుండా, మొత్తం ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారింది. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇరాన్ ఈ క్షిపణి సామర్థ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Follow Us