/rtv/media/media_files/2026/03/03/kheibar-missile-iran-2026-03-03-18-42-38.jpg)
ప్రస్తుతం మధ్యప్రాచ్యం ఓ రణరంగంలో చిక్కుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్‌గా ఇరాన్‌పై దాడి చేసి, ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చడంతో పరిస్థితులు భయంకరంగా మారాయి. ఈ సంఘటనకు ప్రతీకారంగా ఇరాన్ తన అమ్ములపొదిలోని శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించడంతో అరబ్ ప్రపంచం అట్టుడుకుతోంది.
ఇరాన్ ప్రతీకారానికి 'ఖైబర్'
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ మౌనంగా ఉండలేదు. ఇజ్రాయెల్ నగరాలే లక్ష్యంగా వేలాది డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో టెహ్రాన్ విరుచుకుపడింది. కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా, అమెరికాకు మద్దతుగా ఉన్న సౌదీ అరేబియా, ఒమన్, యుఎఇ, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్‌గా చేసుకుంది. ఈ దాడుల్లో ఇరాన్ తన అత్యంత లెటెస్ట్ 'ఖోర్రామ్‌షహర్-4' (ఖైబర్) క్షిపణిని రంగంలోకి దించింది.ఫోర్త్ జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్ అయిన ఖోర్రామ్‌షహర్-4, ఇండియన్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి కంటే ప్రమాదకరమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Iran hasn't used their invisible Missile's.
— Iran Army Update (@iranwarnroom) March 3, 2026
No Defense System in The World Can Detect Them
Wait for Surprise,You will see them in Tel Aviv. pic.twitter.com/xzryOQ8QfS
'ఖోర్రామ్‌షహర్-4' ప్రత్యేకతలివే..
రేంజ్ అండ్ కెపాసిటీ: ఇది 2,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, 1,500 కేజీల భారీ వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు.
హైపర్సోనిక్ వేగం: వాతావరణం వెలుపల దీని వేగం మాక్ 16 కాగా, భూమిపైకి తిరిగి వచ్చేటప్పుడు మాక్ 8 వేగంతో దూసుకువస్తుంది. ఇంతటి వేగాన్ని అడ్డుకోవడం ప్రస్తుత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌కు దాదాపు అసాధ్యం.
వేగవంతమైన ప్రయోగం: హైపర్‌గోలిక్ లిక్విడ్ ఇంజన్ వాడటం వల్ల, కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే దీనిని ప్రయోగించవచ్చు.
రాడార్‌కు చిక్కని డిజైన్: గ్రిడ్ రెక్కలు లేని కాంపాక్ట్ డిజైన్ వల్ల ఇది రాడార్ల కళ్లు కప్పి ప్రయాణించగలదు.
Khorramshahr 4 is combat ready.
— Professor Muhammad Shojaee (@MuhammadShojaee) February 7, 2026
Mach 17.
2 ton warhead.
Maneuverable in space.
A leap in missile mastery. This is Iran rewriting the rules of strategic power.#Iran
pic.twitter.com/Me4KtjsjpY
అమెరికా ఆర్మీ ప్లాన్.. రంగంలోకి USS అబ్రహం లింకన్
మరోవైపు, ఇరాన్ ముప్పును తిప్పికొట్టడానికి అమెరికా తన అణుశక్తితో నడిచే యుద్ధనౌక USS అబ్రహం లింకన్ స్ట్రైక్ గ్రూపును రంగంలోకి దించింది. అధునాతన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో కూడిన ఈ నౌకాదళం మధ్యప్రాచ్య తీరంలో మోహరించింది. అణు ఇంధనంతో ఇది ఎక్కువ కాలం సముద్రంలో ఉండి దాడులను నిర్వహించగలదు.
ఒకవైపు అమెరికా నావికా శక్తి, మరోవైపు ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణి సామర్థ్యం మధ్యప్రాచ్యాన్ని వ్యూహాత్మక యుద్ధ క్షేత్రంగా మార్చాయి. ప్రస్తుతం ప్రత్యక్ష యుద్ధ సంకేతాలు లేకపోయినప్పటికీ, ఈ సైనిక మోహరింపులు ఈ ప్రాంత భద్రతను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
Follow Us