బంగ్లాదేశ్‌పై భారత్‌ సీరియస్‌.. దాడులు ఆపకపోతే..!

బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులకు రక్షణ కల్పించాలంటూ బంగ్లా ప్రభుత్వానికి లేఖ రాసింది. మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారినట్లు చెబుతూ పరోక్షంగా హెచ్చరించింది.

author-image
By srinivas
New Update
bagladesh india issue

బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు

Bagladesh: బంగ్లాదేశ్‌లో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారినట్లు తెలిపింది. ఈ మేరకు హిందువులకు రక్షణ కల్పించాలంటూ బంగ్లా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. 

ఏడాదిలో మొత్తం 2,200 దాడులు..

ఇటీవల కాలంలో హిందువులు టార్గెట్‌గా దాడులు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 2,200 దాడులు జరిగాయి. పాక్‌తో పోలిస్తే బంగ్లాదేశ్ లోనే 20 రేట్లు అధికంగా దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్-భారత్ మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ సన్నిహితుడు మహపుజ ఆలం వివాదాస్పద పోస్ట్ పెట్టడం సరైన చర్య కాదు. బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల సంస్కృతులు ఒకేలా ఉంటాయని, కొందరు ఉన్నత వర్గాలకు చెందిన హిందువులు బంగ్లా వ్యతిరేక ధోరణుల వల్లే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగిందనడం దారుణం అంటూ ఘాటుగా స్పందించింది. ఇక బంగ్లాతో తాత్కాలిక ప్రభుత్వంతో సంబంధాలను పెంపొందించేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. కానీ బంగ్లా నేతలు దాడులకు పాల్పడుతుండటం నిరాశ కలిగిస్తున్నాయి. ఈ విషయాన్ని బంగ్లా ప్రభుత్వం వద్ద లేవనెత్తాం. నేతలు బహిరంగ ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో బంగ్లాదేశ్‌కు చెందిన పిల్లలుంటే.. తమ దృష్టికి తీసుకోవాలని పాఠశాలలకు సర్క్యులర్‌ జారీ చేసింది. బడులలో విద్యనభ్యసిస్తున్న అక్రమ వలసదారుల పిల్లలను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా జాయిన్ చేసుకోవాలని సూచించింది. 

ఇది కూడా చదవండి: ఈ శాంటా క్లాస్ అసలైంది కాదా.. ఆయన పుర్రె ఆధారంగా డిజైన్ చేశారా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు