తిరుగుబాటుదారులు సిరియాలో అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ పాలన అంతమోందించారు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖ అక్కడున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది. మంగళవారం 75 మందిని సిరియా నుంచి సేఫ్ గా లెబనాన్ తీసుకువచ్చారు. అక్కడి నుంచి వారి ఇండియా చేరుకుంటారు. 14 ఏళ్లుగా బషర్ అల్-అస్సాద్ అధ్యక్షుడిగా ఉన్నాడు. భారతీయ పౌరులందరూ సురక్షితంగా లెబనాన్‌కు చేరుకున్నారు. Also Read: Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనితకు హైకోర్టులో బిగ్ రిలీఫ్ వారు విమానాల్లో భారతదేశానికి తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. డమాస్కస్, బీరూట్‌లోని భారత రాయబార కార్యాలయాలతో వారి సేఫ్టీని అంచనా వేసి.. అక్కడ ఉండటం మంచిది కాదని వారిని ఇండియాకు తీసుకువస్తు్న్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సిరియాలో మిగిలి ఉన్న భారతీయ పౌరులు డమాస్కస్‌లోని భారత రాయబార కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబర్స్ ఏర్పాటు చేసింది. సిరియాలో పరిస్థితులను గమనిస్తున్నట్లు MEA తెలిపింది. Also Read : ఇజ్రాయెల్‌ను చూసి మనం నేర్చుకోవాలి.. సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్! Also Read: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం