Earthquake Alert Service: భూకంపం వస్తే మీ ఫోన్ ముందే చెప్పేస్తుంది.. అదెలాగంటే.. ప్రముఖ గూగుల్ సెర్చ్ ఇంజిన్ భారత్‌లో మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలోని సెన్సార్లను ఉపయోగించి భూకంపాల తీవ్రతను గుర్తించి అంచనా వేసే భూకంప హెచ్చరిక సేవను త్వరలోనే విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. By Shiva.K 28 Sep 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Earthquake Alert Service: ప్రముఖ గూగుల్ సెర్చ్ ఇంజిన్ భారత్‌లో మరో కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లలోని సెన్సార్లను ఉపయోగించి భూకంపాల తీవ్రతను గుర్తించి అంచనా వేసే భూకంప హెచ్చరిక సేవను త్వరలోనే విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ సిస్మోలజీ సెంటర్ (NSC)తో సంప్రదించి Google భారతదేశంలో ‘Android Earthquake Alert Service‘ని ప్రవేశపెట్టనుంది. ‘‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(NDMA), నేషనల్ సిస్మోలజీ సెంటర్(NSC)తో సంప్రదించి.. భారతదేశంలో ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను పరిచయం చేస్తున్నాం. ఈ ప్రయోగం ద్వారా మేము ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఆటోమేటిక్ ముందస్తు హెచ్చరికలను అందించడానికి ప్రయత్నిస్తున్నాం. దీని ద్వారా వారి వారి ప్రాంతంలో భూకంపం రావడానికి ముందే అలర్ట్‌ను జారీ చేసింది.’’ అని గూగుల్ ప్రకటించింది. ‘ఈ అలర్ట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 5, ఆపై అప్‌డేట్ సిస్టమ్‌లో అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల సిస్టమ్ రాబోయే వారంలో భారతదేశంలోని ఆండ్రాయిడ్ 5+ వినియోగదారులందరికీ అందుబాటులోకి రాబోతోంది‘ అని బ్లాగ్‌లో పేర్కొంది. అయితే, ఈ సిస్టమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే చిన్న యాక్సిలరోమీటర్‌ల సహాయాన్ని తీసుకుంటుందని, ఇవి మినీ సీస్మోమీటర్‌లుగా పనిచేస్తాయని తెలిపారు. ‘ఫోన్‌ను ప్లగిన్ చేసి, ఛార్జింగ్ చేసినప్పుడు అది భూకంపం వచ్చే సూచనలను గుర్తిస్తుంది. చాలా ఫోన్‌లు ఒకే సమయంలో భూకంపం ప్రకంపనలను గుర్తిస్తే.. ఆ సమయంలో, ఆ ప్రాంతంలో భూకంపం సంభవించవచ్చని అంచనా వేయడానికి తమ సర్వర్ ఈ సమాచారాన్ని ఉపయోగిస్తుంది’ అని గూగుల్ పేర్కొంది. ఇంటర్నెట్ సిగ్నల్స్ కాంతి వేగతంలో ప్రయాణిస్తాయని, భూమిలో భూకంప తరగాలు వ్యాప్తి చెందడానికి కంటే చాలా వేగంగా ప్రయాణిస్తాయని గూగుల్ పేర్కొంది. ఈ కారణంగా తీవ్రమైన భూకంపానికి చాలా సమయం ముందే హెచ్చరికలు ఫోన్‌కు అందుతాయని గూగుల్ తెలిపింది. ‘భారతదేశంలో, Google సెర్చ్, మ్యాప్స్‌లో వరదలు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి సహాయకర భద్రతా సమాచారాన్ని వినియోగదారులకు అందించడానికి NDMAతో కలిసి పని చేస్తున్నాము. NSCతో పాటు NDMAతో మా అనుబంధాన్ని మరింతగా పెంచుకోవడం సంతోషంగా ఉంది. ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను భారతదేశానికి తీసుకురావడం మరింత గర్వకారణంగా ఉంది.’ అని గూగుల్ పేర్కొంది. కాగా, భూకంపం ప్రారంభమైనప్పుడు ప్రజలకు ముందస్తు హెచ్చరికను అందించడానికి ఈ ఫీచర్‌ను ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలలో అమలులో ఉంది. Also Read: Lokesh Yuvagalam: యువగళం పాదయాత్రపై నారా లోకేష్ కీలక నిర్ణయం..! అరెస్ట్ భయంతోనేనా..? Vinayaka Nimajjanam: నిమజ్జనంలో డ్యాన్స్ తో దుమ్ములేపిన చిరంజీవి, పవర్ స్టార్, బాలయ్య.. వైరల్ గా మారిన వీడియోలు! #google-earthquake-alert #earthquake-alert #android-earthquake-alert-service #google మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి