Unemployment Benefits: నిరుద్యోగులకు శుభవార్త...జనవరి 1 నుంచి రూ. 3వేల నిరుద్యోగ భృతి..ఈ అర్హతలు ఉండాల్సిందే..!!

కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన యువనిధి స్కీం ఎట్టకేలకు అమలు తేదీని ఖరారు చేసింది. ఈ స్కీంకు సంబంధించి దరఖాస్తు డిసెంబర్ 21 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. 5లక్షల మంది అభ్యర్థులు ఈ ప్రోత్సాహకాన్ని పొందుతురాని సర్కార్ తెలిపింది.

New Update
Telangana : తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పు

కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 5 హామీల్లో ఒక్కటైన యువనిధి స్కీమ్ ను అమలు చేసేందుకు తేదీని ఖరారు చేసింది. దీని లబ్ధిదారులు కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ తేదీని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం..యువనిధి స్కీంకు సంబంధించిన దరఖాస్తు డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. దాదాపు 5లక్షల మంది అభ్యర్థులు ఈ ప్రోత్సాహకాన్ని పొందుతారని ప్రభుత్వం తెలిపింది.

అభ్యర్థుల ఖాతాల్లోకి యువనిధి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో కూడా ప్రభుత్వం తెలిపింది. 2024 జనవరి నుంచే యువనిధి స్కీం సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2022-23లో నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని అందించేందుకు కర్నాటక సర్కార్ యువనిధి యోజనను అమలు చేసింది. ఈ స్కీం దరఖాస్తు చేసుకునేందుకు ఎవరు అర్హులు. అది పొందిన వారికి ఎంత అందిస్తారు అనే మొత్తం సమాచారాన్ని అధికారిక వెబ్ సైట్ https://sevasindhu.karnataka.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

యువనిధి యోజన కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఈ విధంగా ఉండాలి. 2023లో ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లు, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత ఉద్యోగం చేయనివారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి లేదా గరిష్టంగా 2ఏళ్ల వరకు ఉద్యోగం పొందే వరకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. యువనిధి యోజన కర్నాటక రాష్ట్రంలోని కన్నడిగుల అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది. యువనిధి యోజన భత్యం డిబిటి ద్వారా అందించేందుకు ఉద్దేశించబడింది. లబ్ధిదారులు డిసెంబర్ 21 నుంచి సేవా సింధు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

స్థానికతను తెలిపే సర్టిఫికేట్ తోపాటు..అభ్యర్థులు తాము నిరుద్యోగులమని స్వయంగా ప్రకటించుకోవల్సి ఉంటుంది. అఫిడవిట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించిన తేదీ నుంచి 6నెలల వరకు అధికారిక బ్యాంక్ అకౌంట్ల్ స్టేమ్ మెంట్ కాపీని తప్పనిసరిగా సమర్పించాలి. డిప్లొమా ఉత్తీర్ణత నిరుద్యోగులకు నెలకు రూ. 1500 అందిస్తారు. గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు నెలకు రూ. 3000 అందజేస్తారు.

ఇది కూడా చదవండి: ఆ డిగ్రీలు చేస్తున్న వారికి యూజీసీ అలర్ట్.. గుర్తింపు లేదని ప్రకటన..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు