/rtv/media/media_files/2026/03/15/fake-robbery-2026-03-15-15-56-21.jpg)
అమెరికాలో స్థిరపడాలనే ఆశతో అడ్డదారులు తొక్కిన 11 మంది భారతీయుల బాగోతం బయటపడింది. 'యు-వీసా' పొందేందుకు ఏకంగా దొంగతనాలనే డ్రామా ఆడి, చివరికి FBI చేతికి చిక్కి కటకటాల పాలయ్యారు.
అమెరికా వీసా కోసం వింత డ్రామా
అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి వీలు కల్పించే 'యు-వీసా' దక్కించుకోవడం కోసం కొంతమంది భారతీయులు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది. నిబంధనల ప్రకారం వీసా రాదని తెలిసి, తాము నేర బాధితులమని నిరూపించుకుంటే సులభంగా వీసా వస్తుందనే అడ్డదారిని వీరు ఎంచుకున్నారు.
ఏమిటీ కుట్ర?
సాధారణంగా అమెరికాలో ఏదైనా హింసాత్మక నేరానికి లేదా దోపిడీకి గురై, పోలీసుల విచారణకు సహకరించే బాధితులకు మానవతా దృక్పథంతో 'U Non-immigrant Status' (U Visa) మంజూరు చేస్తారు. దీనిని ఆసరాగా చేసుకున్న రాంభాయ్ పటేల్ అనే వ్యక్తి నేతృత్వంలోని ముఠా, నకిలీ దోపిడీలను ప్లాన్ చేసింది. వీరు కొన్ని మద్యం దుకాణాలు, రెస్టారెంట్ యజమానులకు డబ్బులు ఇచ్చి, వారి షాపుల్లో దొంగతనం జరిగినట్లు సీన్ క్రియేట్ చేసేవారు. వీసా కావాల్సిన వ్యక్తులు ఈ ముఠాకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి, ఆ సమయంలో షాపులో పని చేస్తున్నట్లు లేదా అక్కడ ఉన్నట్లు నటించేవారు.
FBI arrests 11 Indian nationals, all named Patel, in a wild immigration scam. They staged fake armed robberies so participants could cheat their way into U Visas.
— Saniya Sayed (@Ssaniya_) March 14, 2026
Yes, all of them are PATEL. pic.twitter.com/VzcpEu9zio
సీన్ రికార్డింగ్: ఒక వ్యక్తి నకిలీ తుపాకీతో వచ్చి వీరిని బెదిరించి, నగదు దోచుకెళ్తున్నట్లు CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యేలా ప్లాన్ చేసేవారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి, తాము బాధితులమని క్లెయిమ్ చేసేవారు. వరుసగా జరుగుతున్న ఈ దోపిడీలపై అనుమానం వచ్చిన అమెరికన్ ఫెడరల్ ఏజెన్సీలు లోతుగా విచారణ చేపట్టాయి. బాధితులుగా చెప్పుకుంటున్న వారి మాటల్లో పొంతన లేకపోవడం, షాపు యజమానుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అసలు విషయం బయటపడింది.
మసాచుసెట్స్, కెంటుకీ, మిస్సౌరీ, ఒహియో వంటి వివిధ రాష్ట్రాల్లో తలదాచుకున్న 11 మంది నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో జితేంద్రకుమార్ పటేల్, మహేష్ కుమార్ పటేల్, సంజయ్ కుమార్ పటేల్ వంటి వారు ఉన్నారు. ఒక నిందితురాలిని ఇప్పటికే భారత్‌కు డిపోర్ట్ చేశారు. అమెరికా చట్టాలను అతిక్రమించి వీసా మోసాలకు పాల్పడినందుకు వీరికి భారీ జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత వీరిని శాశ్వతంగా అమెరికా నుండి బహిష్కరించే అవకాశం ఉంది. అమెరికా కల కోసం అడ్డదారులు తొక్కితే జీవితమే ప్రమాదంలో పడుతుందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.
Follow Us