/rtv/media/media_files/2026/03/21/ustaad-bookings-2026-03-21-16-01-42.jpg)
Ustaad Bookings
Ustaad Bookings: పవన్ కళ్యాణ్ Pawan Kalyan హీరోగా, హరీష్ శంకర్ Harish Shankar దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మార్చి 19న థియేటర్లలో విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల Sreeleela, రాశి ఖన్నా Raashii Khanna హీరోయిన్లుగా నటించారు.
రిలీజ్ రోజు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు బుక్‌మైషోలో సుమారు 3.11 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. రెండో రోజు కూడా మంచి స్థాయిలోనే బుకింగ్స్ కొనసాగాయి. దాదాపు 1.36 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.
ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం (ప్రీసేల్స్‌తో కలిపి) సుమారు 8.5 లక్షల టికెట్లు బుక్‌మైషోలో అమ్ముడయ్యాయి. ఈ వీకెండ్‌కు 10 లక్షల టికెట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో ఆర్.పార్తీబన్ R. Parthiban, రావు రమేష్ Rao Ramesh, గౌతమి Gautami, K. S. Ravikumar ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ Mythri Movie Makers నిర్మించగా, సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ Devi Sri Prasad, S. థమన్ అందించారు.
Follow Us