Spider-Man: Brand New Day: స్పైడర్ మ్యాన్ వచ్చేస్తున్నాడు..! ఈసారి మరింత కొత్తగా.. ట్రైలర్ చూసేయండి!

Spider-Man: Brand New Day ట్రైలర్ 24 గంటల్లో 720 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు స్థాయి హైప్ క్రియేట్ చేసింది. No Way Home కంటే పెద్ద కలెక్షన్స్ వస్తాయని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది.

New Update
Spider-Man: Brand New Day

Spider-Man: Brand New Day

Spider-Man: Brand New Day: ఇటీవల హాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన సినిమాల్లో ఒకటిగా "Spider-Man: Brand New Day" రాబోతుంది. ఈ సినిమాలో ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది, విడుదలైన వెంటనే ఈ ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

అప్‌డేట్‌ల ప్రకారం, ఈ ట్రైలర్ 24 గంటల్లో యూట్యూబ్‌లో సుమారు 720 మిలియన్ల వ్యూస్ (మొత్తం) సాధించింది. ఇది వేరే ఏ సినిమా ట్రైలర్ లు 24 గంటల్లో సాధించిన హైయెస్ట్ వ్యూస్ కావడం విశేషం. దీని బట్టి చుస్తే ఈ కొత్త స్పైడర్-మ్యాన్ సినిమా చుట్టూ ఉన్న హైప్‌ ఏ రేంజ్ లో ఉందొ తెలుస్తోంది.

ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, సోషల్  మీడియాలో వచ్చిన ఈ హైప్ బాక్సాఫీస్ వసూళ్లలోకి మార్చగలదా అని. ఈ ఫ్రాంచైజీ గత చిత్రం "No Way Home" ప్రపంచవ్యాప్తంగా 1.9 బిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది, "Brand New Day" నుండి ఇంకా పెద్ద సంఖ్యలు రావచ్చని అంచనా.

ప్రేక్షకులు ఇప్పుడు ఈ సినిమా 2 బిలియన్ల డాలర్ల మార్క్‌ను చేరగలదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూలై 31న థియేటర్స్‌లో విడుదల కానుంది.

మొత్తానికి, ట్రైలర్ రికార్డు స్థాయిలో విజువల్స్ సంపాదించినప్పటికీ, అసలు విజయాన్ని బాక్సాఫీస్‌ రిలీజ్ తర్వాత తేలనుంది.

Advertisment
తాజా కథనాలు