Renu Desai: ఏపీకి తెలుగు ఇండస్ట్రీ..  రేణూ దేశాయ్‌ కీలక కామెంట్స్

ఏపీలో తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అయితే బాగుంటదని రేణూ దేశాయ్‌ తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు ఆహ్వానించడం సంతోషకరమని అన్నారు. తన కొడుకు అకీరా నందన్‌ ఎంట్రీపై తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.

New Update
renu desai ap

renu desai ap Photograph: (renu desai ap )

తన కొడుకు అకీరా నందన్‌ సినిమా ఎంట్రీపై నటి రేణూ దేశాయ్‌ స్పందించారు. తాజాగా రాజమహేంద్రవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అందరిలాగే తన కొడుకు ఎంట్రీ కోసం  తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.  ఒక తల్లిలా ఆ క్షణం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని  రేణూ దేశాయ్‌ చెప్పుకొచ్చారు. అయితే దీనిపై పూర్తి  నిర్ణయం అకీరా పైనే ఆధారపడి ఉందని స్పష్టంచేశారు.  సినిమాల్లోకి అకీరా ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాడంటూ రేణూ దేశాయ్‌ తెలిపారు.  

సెంకడ్ ఇన్నింగ్స్ ఇంకెన్ని సార్లు

ఇక తన సెంకడ్ ఇన్నింగ్స్ పై స్పందించారు రేణూ దేశాయ్‌.  ఇప్పటికే తన సెంకడ్ ఇన్నింగ్స్ ఎన్నోసార్లు అయిపోయిందని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో నాలుగు సినిమాలున్నాయని చెప్పిన రేణూ దేశాయ్.. త్వరలో అవి సెట్స్ పైకి వెళ్లనున్నాయన్నారు. 22 ఏళ్ల తరువాత ఓ యాడ్  కోసం వర్క్ చేశానని తెలిపారు.  తానెప్పుడూ సినిమాల్లోకి రావాలని అనుకోలేదని..  ఇదంతా విధి రాత అని ఆమె అభిప్రాయపడ్డారు.  

ఇక రాజమహేంద్రవరం ఓ స్వర్గమని.. ఇక్కడి  పచ్చని పొలాలు చూసి తన మనసు అనందంతో నిండిపోయిందిన్నారు.  తనకు మూగజీవాలంటే  చాలా ఇష్టమని తెలిపిన రేణూ దేశాయ్‌..  సామాజిక సేవా కార్యక్రమాల కోసం నా కుమార్తె ఆద్య పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేశానని తెలిపారు.  ఏపీలో తెలుగు ఇండస్ట్రీ డెవలప్ అయితే బాగుంటదని తెలిపారు.  తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలు ఆహ్వానించడం సంతోషకరం అని అన్నారు.  

అకీరా నందన్‌ సినిమా ఎంట్రీ గురించి రేణూ దేశాయ్‌  స్పందించడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఆమె ఇదే విషయాన్ని చెప్పారు.  అటు  అకీరా నందన్‌ కూడా ఇండస్ట్రీలోకి రావడానికి ఇంట్రెస్ట్ గానే ఉన్నాడు.  ఇప్పటికే న్యూయార్క్‌లోని ఫిల్మ్‌ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.  అంతేకాకుండా  పియానో కూడా నేర్చుకున్నాడు. అయితే అకీరా నందన్‌  ఎంట్రీపై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలు తగ్గించడంతో ఆయన ప్లేస్ లో అకీరాను చూసుకోవాలని అనుకుంటున్నారు.  

Also Read :  విజయ్‌కి పోటీగా రాజకీయాల్లోకి త్రిష..  టార్గెట్ సీఎం కుర్చీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు