మోహన్ బాబు, మంచు విష్ణుల వద్ద గన్స్.. స్వాధీనం చేసుకోనున్న పోలీసులు

మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య కొన్ని రోజులుగా వైరం పెరుగుతుంది. మంగళవారం మంచు మోహన్ బాబు, విష్ణుల నుంచి జూబ్లీహిల్స్ పోలీసులు లైసెన్స్ గన్స్ లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి భారీగా పోలీసులు చేరుకుంటున్నారు.

author-image
By K Mohan
New Update
moha

మంచు ఫ్యామిలీలో గొడవలు ముదురుతున్నాయి. మోహన్ బాబు, అతని చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గతకొన్ని రోజులు వైరం పెరుగుతుంది. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చుకునే కానుంచి బౌన్సర్లను తీసుకొని ఇళ్ల మీదకు వెళ్లి దాడి చేసుకునే దాకా  మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తగాదాలు వెళ్లాయి. ఈ క్రమంలో మంగళవారం మంచు మోహన్ బాబు, విష్ణుల నుంచి లైసెన్స్ గన్స్‌ను  స్వాధీనం చేసుకోవాలని రాచకొండ కమిషనరేట్ జూబ్లిహిల్స్ పోలీసులకు ఆదేశాలు పంపింది.

ఇది కూడా చదవండి : మోహన్ బాబు ఇంటి గేట్‌ను తోసుకుంటూ లోపలికి వెళ్లిన మనోజ్

Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్!

Mohan Babu Family

జూబ్లి హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని మంచు విష్ణు, మోహన్ బాబుల గన్స్ కు వాడుతున్నారు. వారి ఫ్యామిలీ గొడవల కారణంగా పోలీసులు వాటిని హ్యాడ్ ఓవర్ చేసుకోనున్నారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి భారీగా పోలీసు బలగాలు మోహరిస్తున్నాయి. మనోజ్ గేట్లు తన్నుకుంటూ  మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లాడు. ఈ రోజు మోహన్ బాబు మంచు మనోజ్ పైన ఓ ఆడియో రిలీజ్ చేశాడు. మోహన్ బాబు ఇంటికి న్యూస్ కవరేజ్ కు వెళ్లిన మీడియా రిపోర్ట్ లను పై దాడి చేశారు. మోహన్ బాబు క్షమాపనలు చెప్పాలని మీడియా డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం 

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు