Mohan Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు అరెస్టుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే జర్నలిస్ట్ దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోరుతూ పిటీషన్ దాఖలు చేసుకోగా.. నేడు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మోహన్ బాబు ముందుస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. అయితే డిసెంబర్ 24 వరకు అరెస్టు చేయోద్దని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో.. ఆ తర్వాత నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.