గతేడాది క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడో ఓ లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయాడు. అదే దిల్ రూబా. వాస్తవానికి క సినిమా కంటే ముందే దిల్ రూబా స్టార్ట్ అయినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాతో విశ్వ కరుణ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ , ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇది కిరణ్ కు 10వ సినిమా కావడం విశేషం. ప్రేమ పెట్టే బాధ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రేమలో ఫెయిల్ అయిన ఓ కాలేజ్ కుర్రాడు మరో అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ తరువాత అతని జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది సినిమా పాయింట్. ప్రేమ చాలా గొప్పది కానీ అది ఇచ్చే భాద చాలా భయంకరంగా ఉంటుంది వంటి డైలాగ్ లు ఆకట్టుకునన్నాయి. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. రుక్సాన్ థిల్లర్ హీరోయిన్ గా ఇందులో కిరణ్ అబ్బవరం సరసన నటించిన రుక్సాన్ థిల్లర్ హీరోయిన్ గా నటించింది. ఈమెది ఇందులో ఇంపార్టెంట్ రోల్ అని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గారిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. క లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. Also Read : మహేశ్, రాజమౌళి మూవీ రిలీజ్ డేట్ లీక్ చేసిన రామ్ చరణ్.. వీడియో వైరల్