Jr.NTR: సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన మాటని నిలబెట్టుకొని.. పెద్ద మనసు చాటుకున్నారు. క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్ చికిత్సకు సాయం చేశారు. కౌశిక్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని డిశ్చార్జి కోసం జూనియర్ ఎన్టీఆర్ టీమ్ రూ. 12 లక్షలు చెల్లించింది. జూనియర్ ఎన్టీఆర్ తరుఫున ఆయన టీమ్ కౌశిక్ు డిశ్చార్జి చేసేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో కౌశిక్ మంగళవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ఈ నేపథ్యంలో కౌశిక్ తల్లి సరస్వతమ్మ జూనియర్ ఎన్టీఆర్ కి కృత జ్ఞతలు తెలియజేశారు. RTV కథనాలకు స్పందించిన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గతంలో కౌశిక్ అనే తన అభిమాని క్యాన్సర్ ట్రీట్ మెంట్ ఖర్చులు భరి స్తారని అభిమానికి భరోసా ఇచ్చారు. అయితే.. ఆ తర్వాత మాత్రం ముఖం చాటేశారని.. కౌశిక్ తల్లి సరస్వతి ఆరోపణలు చేసింది. ఎన్టీఆర్ దేవర రీలీజ్ సమయంలో ఈ విధంగా అన్నారని.. సినిమా తర్వాత కనీసం తమను ఎవరూ సంప్రదించ లేదని. తాము ప్రయత్నిస్తే.. ఎవరూ అందుబాటులోకి రాలేదని కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో సరస్వతి ఆవేదనను RTV ప్రసారం చేసింది. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై ముఖ్యంగా.. పొలిటికల్ గా మాత్రమే కాకుండా.. ఇండస్ట్రీలో కూడా చర్చ కొనసాగిం ది. ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే అప్రమత్తమయ్యా రు. తన టీమ్ ని అలర్ట్ చేసి అవసరమైన మొత్తాన్ని చెల్లించారు.