సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. అల్లు అర్జున్ వెంట నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని.. రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు ఆయనకు తెలిపారు. కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజను పరామర్శించేందుకు బేగంపేట్‌లోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్న అల్లు అర్జున్.@alluarjun #Hyderabad #kimshospital #AlluArjun #sritej #RTV pic.twitter.com/qgW7aPwkRu — RTV (@RTVnewsnetwork) January 7, 2025 అంతకుముందు రోజు అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. శ్రీతేజ్‌ను చూసేందుకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే ముందు తమకు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో వెల్లడించారు. పోలీసుల అనుమతితోనే బన్నీ శ్రీతేజ్‌ను చూసేందుకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో పోలీసులు ఆసుపత్రి ముందు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో శ్రీతేజ్ ను చూసిన బన్నీ.. అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ పై కేసు ఏంటీ? 2024 డిసెంబర్ 04వ తేదీన పుష్ప2 (Pushpa 2) బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై రేవతి భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు. ఇది జరిగిన కాసేపటికే హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటిరోజు విడుదలయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి పుష్ప2 మేకర్స్ అండగా నిలిచారు. హీరో అల్లు అర్జున్ కోటి రూపాయలు, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు తలో రూ. 50 లక్షల పరిహారం అందజేశారు.