Hebah Patel: మరో కొత్త ప్రాజెక్ట్ కు హెబ్బా గ్రీన్ సిగ్నల్

యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. డిఫరెంట్ జానర్ సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తాజాగా మరో కామెడీ ఎంటర్ టైనర్ తో అలరించేందుకు సిద్ధమైంది.

New Update
hebah patel

hebah patel

Hebah Patel: యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. డిఫరెంట్ జానర్ సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. రీసెంట్ గా  'ఈషా'  సినిమాతో భయపెట్టిన  ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో కామెడీ ఎంటర్ టైనర్ తో అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను మేకర్స్ ప్రకటించారు. 

hebahpatel
hebah patel

‘దర్జా’ ఫేమ్ డైరెక్టర్ తో 

అర్జున్ అర్జున్ ఆర్ట్స్ సమర్పణలో చిత్రాలయ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ‘దర్జా’ సినిమాతో  ఆకట్టుకున్న సలీం మాలిక్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం. సమీర్ సంగీతం అందిస్తున్నారు.  విష్ణు పానికర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త ఎక్స్‌పీరియెన్స్ అందించాలని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మాలిక్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.  మేకర్స్ కూడా భారీ బడ్జెట్ తో దీనిని నిర్మిస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. సినిమాలోని ఇతర నటీనటుల గురించి త్వరలోనే వెల్లడించనున్నారు. 

  Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్‌సింగ్..ఏపీలో టికెట్‌ రేట్లు పెంపు!

Advertisment
తాజా కథనాలు