అలనాటి అందాల తార శ్రీదేవికి చాలా మంది అభిమానులున్నారు. అందులో డైరెక్టర్ ఆర్జీవీ ఒకరు. ఆమెకు ఆయన వీరాభిమాని. శ్రీదేవిని ఆయన ఓ దేవతలగా పూజిస్తుంటారు. అయితే ఆమె వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్ పై మాత్రం ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ మాట్లాడుతూ.. పదహారేళ్ళ వయసు. వసంత కోకిల లాంటి సినిమాల్లో శ్రీదేవి నటన అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె నటన చూశాక తానోక ఫిల్మ్ మేకర్‌ననే విషయాన్ని మర్చిపోయానని చెప్పుకొచ్చారు. సినిమాల్లో ఆమెని చూస్తూ ఓ ప్రేక్షకుడిగా ఉండిపోయానన్నారు. అది ఆమె స్థాయి అని ఆమెను దయచేసి ఎవరితో పోల్చవద్దని చెప్పాడు వర్మ. ఫీలింగ్స్ రావట్లే ఇక ఆమె కూతురైన జాన్వీకపూర్‌తో సినిమా చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అని ప్రశ్నించగా.. తనకు శ్రీదేవి అంటే ఇష్టమని ఆమెతో సినిమా చేశాక చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో సినిమాలు చేసినప్పటికీ కనెక్ట్ అవ్వలేకపోయానని తెలిపారు. అలాగే, జాన్వీకపూర్ తోనూ సినిమా చేసే ఉద్దేశం లేదన్నారు ఆర్జీవీ. శ్రీదేవీతో.. జాన్వీని కంపేర్ చేయలేమని తెలిపారు వర్మ . జాన్వీని చూస్తే.. ఆమెతో సినిమా తీయాలని ఫీలింగ్స్ కలగడంలేదని చెప్పుకోచ్చాడు వర్మ. దేవరతో క్రేజ్ గతంలో శ్రీదేవితో తనను పోలుస్తూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేయడంపై జాన్వీ స్పందించారు. అమ్మతో నన్ను పోల్చి చూడటం అదృష్టంగా భావిస్తానని చెప్పుకొచ్చింది. ఆమె వల్లే నాకు ఈ జీవితం లభించిందని. ఆమె నాకు ఎప్పటికీ ఆదర్శమేనని చెప్పుకొచ్చింది. ధడక్ మూవీతో వెండి తెరపై ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్.. గతేడాది ఎన్టీఆర్ దేవర చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో ఆమె తంగం అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో జాన్వీకపూర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. త్వరలో రామ్ చరణ్ తో జతకట్టనుంది ఈ ముద్దుగుమ్మ. Also Read : హీరోయిన్‌గా బ్రాహ్మణి.. బాలయ్యకు ఫోన్ చేసిన మణిరత్నం