Dhurandhar 2: "ధురంధర్" ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. తెలుగు వెర్షన్ రిలీజ్ క్యాన్సిల్?

రణవీర్ సింగ్ "ధురంధర్ 2" సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో షాక్ ఎదురైంది. కంటెంట్ ఆలస్యం కారణంగా ప్రీమియర్ షోలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. బుకింగ్స్ కూడా ఆపివేయడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

New Update
Dhurandhar 2

Dhurandhar 2

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటించిన "ధురంధర్ 2: ది రివెంజ్" సినిమాకు సంబంధించిన ఒక పెద్ద షాకింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఇది నిరాశ కలిగించే విషయం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈరోజు ప్లాన్ చేసిన చాలా ప్రీమియర్ షోలు చివరి నిమిషంలో రద్దు అయ్యాయి. సినిమా కంటెంట్ సమయానికి అందకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని సమాచారం.

ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు ఈ నిర్ణయంతో నిరాశ చెందుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ డేనే సినిమా చూడాలని ప్లాన్ చేసిన వాళ్లు ఇబ్బంది పడుతున్నారు.

ప్రస్తుతం చాలా థియేటర్లలో బుకింగ్స్ ఆపేసారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా షోలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు కొన్ని గంటలు మాత్రమే ఉండగా ఈ మార్పులు రావడం వల్ల ప్రేక్షకుల్లో గందరగోళం ఏర్పడింది. ఈ విషయంపై త్వరలో పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు