Abhijeet Bhattacharya: బాలీవుడ్ సింగర్ అభిజిత్ భట్టాచార్య సంగీత ప్రపంచంలో ప్రముఖ గాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. 1990 లో సంగీత రంగంలో అడుగుపెట్టిన ఆయన 1000కి పైగా సినిమాల్లో 6000 కంటే ఎక్కువ పాటలు పాడి ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. మేన్ తెరా దుష్మన్, యే కాలి కాలి ఆంఖేన్, చూపనా భీ నహీ ఆతా, పెహ్లా నషా, తేరా నామ్ లియా, అంకోన్ మేన్ తెరీ వంటి పాటలు పాపులర్ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. హిందీతో పాటు మరాఠీ , నేపాలీ , తమిళం , భోజ్‌పురి , పంజాబీ , ఒడియా, బెంగాలీ పలు భాషల్లో ఆయన పాటలు పాడారు. Also Read: Hansika: హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు! మహాత్మ గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ సింగర్ భట్టాచార్య పలు విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన మహాత్మ గాంధీ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మహాత్మ కంటే సంగీత దర్శకుడు ఆర్‌డి బర్మన్ గొప్పవాడని అన్నారు. సంగీత ప్రపంచానికి బర్మన్ జాతిపిత అని తెలిపారు. మహాత్మ గాంధీ పాకిస్థాన్ జాతిపిత.. భారతదేశానికి కాదు.. పొరపాటున ఆయనను జాతిపిత అని పిలిచారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!