ప్లీజ్.. ఆ వీడియోను తొలిగించండి :  కోర్టు మెట్లెక్కిన రమ్య

హాస్టల్ హుడుగారు బేకగిద్దరే చిత్రంలో తన అనుమతి లేకుండా తన వీడియోను వాడుకున్నారని వాటిని తొలిగించాలంటూ నటి, మాండ్య మాజీ ఎంపీ రమ్య  అలియాస్ దివ్యస్పందన  కోర్టును ఆశ్రయించారు.  ఈ కేసులో ఆమె కోటి రూపాయలను పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది.

New Update
ramya ex mp

ramya ex mp Photograph: (ramya ex mp)

2023లో కన్నడలో విడుదలైన హాస్టల్ హుడుగారు బేకగిద్దరే చిత్రంలో తన అనుమతి లేకుండా తన వీడియోను వాడుకున్నారని వాటిని తొలిగించాలంటూ నటి, మాండ్య మాజీ ఎంపీ రమ్య  అలియాస్ దివ్యస్పందన  కోర్టును ఆశ్రయించారు.  ఈ కేసులో ఆమె కోటి రూపాయలను పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది.  ఈ సినిమాలో తన వీడియోను తొలగించాలని పలుమార్లు నిర్మాతలను కోరినప్పటికి వారు  స్పందించలేదని ఆరోపించింది.  సినిమా నుండి వీడియోను తొలిగిస్తే తన పిటిషన్ ను వెనక్కు తీసుకుంటానని రమ్య వెల్లడించారు.  తన న్యాయవాదితో కలిసి కోరక్టు వచ్చిన రమ్య  తన వద్ద ఉన్న దాఖలాలను అందజేసి వెళ్లారు. కాగా  నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన హాస్టల్ హుడుగారు బేకగిద్దరే చిత్రాన్ని రక్షిత్ శెట్టి పరమవ స్టూడియోస్ నిర్మించింది.  సినిమాకు ఆశించినంతగా పెద్దగా లాభాలు కూడా ఏమీ రాలేదు.  మరి ఈ సినిమాపై కోర్టు మెట్లెక్కిన రమ్యకు న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.  

అభి సినిమాతో ఎంట్రీ

కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్  హీరోయిన్ గా ఎదిగారు రమ్య.  అభి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.  తొలి సినిమాతోనే పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సరసన హీరోయిన్‌గా నటించారు. తెలుగులో ఇదే సినిమాను కల్యాణ్ రామ్ హీరోగా అభిమన్యు పేరుతో రిమేక్ చేయగా ఇందులో కూడా రమ్యనే హీరోయిన్ గా తీసుకున్నారు.  ఆ తరువాత సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో నటించారు.  సినిమాల్లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు.  

2013లో జరిగిన బై-ఎలక్షన్‌లో కర్ణాటకలోకి మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు  ఆ తరువాత ఎన్నికల్లో  ఇదే నియోజకవర్గం నుంచి  ఎంపీగా పోటీ చేసి రెండుసార్లు ఓడిపోయారు.  ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న రమ్య..   తాను మళ్లీ నటించేందుకు ఆసక్తిగా ఉన్నానని, అయితే సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. మంచి స్క్రిప్టు దొరికితే తప్పకుండా నటిస్తానని వెల్లడించారు.  కన్నడ చిత్రం, సంజు వెడ్స్ గీత 2 జనవరి 10న విడుదల కానుండగా, చిత్ర బృందానికి రమ్య తన శుభాకాంక్షలు తెలియజేసింది.

Also Read :  ఆంధ్రాకు నేడు ప్రధాని మోదీ.. కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు