Nora Fatehi: అమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ అడవుల్లో చెలరేగిన అగ్ని ప్రమాదం విధ్వంసం సృష్టించింది. 24 గంటలు గడిచినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఈ అగ్ని ప్రమాదంలో పలువురి ఇళ్ళు దగ్దమయ్యాయి. సామాన్యులతో పాటు హాలీవుడ్ తారలు కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లు విడిచి వెళ్లిపోతున్నారు. Also Read : మహారాష్ట్రలో ఘోరం.. రూ. 500 కోసం సొంత తమ్ముడి హత్య.. అసలేం జరిగిందంటే ? నోరా ఫతేహి వీడియో ఈ క్రమంలో ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో ఉన్న నటి నోరా ఫతేహి (Nora Fatehi) కూడా తన ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నోరా స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. లాస్ ఏంజెల్స్ లో వేగంగా వ్యాపిస్తున్న మంటల బాటలోనే ఆమె నివసిస్తున్న హోటల్ కూడా ఉంది. దీంతో ఆ ప్రదేశంలోని ఇళ్ళు, హోటల్స్ అన్నీ ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు పంపింది. ఈ మేరకు నోరా హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్లు వీడియోలో పంచుకుంది. Also Read : Game Changer: దుమ్మురేపుతున్న గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఎన్ని కోట్లంటే! अमेरिका में फंसीं नोरा फतेही..कैलिफोर्निया के जंगल में लगी आग के बीच अमेरिका में फंसी नोरा फतेही, वीडियो शेयर कर सुनाई आपबीती #NoraFatehi । #California । #fires pic.twitter.com/3aPP3DRG8P — NDTV India (@ndtvindia) January 9, 2025 దూరంగా వెళ్ళిపోతున్నాను.. నోరా ఫతేహి వీడియోలో మాట్లాడుతూ.. నేను లాస్ ఏంజెల్స్ లో ఉన్నాను. ఇక్కడ మంటలు బాగా వ్యాపిస్తున్నాయి. ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు.. ఏరియాను ఖాళీ చేయమని మాకు 5 నిమిషాల క్రితం లేఖ వచ్చింది. నేను త్వరగా నా వస్తువులను ప్యాక్ చేశాను. ఈ ప్రాంతం నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నాకు ఫ్లైట్ ఉంది.. దానిని నేను క్యాచ్ చేయాలని ఆశిస్తున్నాను. నేనెప్పుడూ ఇలాంటివి అనుభవించలేదు అని వీడియోలో తెలిపింది నోరా. ఇప్పటికే ఈ కార్చిచ్చు కారణంగా ఐదుగురు చనిపోయారు. కొన్ని ప్రాంతాల్లో మంటలు అదుపులోకి రాగా.. మరికొన్ని ప్రాంతాల్లో గాలి వేగం ఎక్కువగా ఉన్నందున మంటలను అదుపులోకి తీసుకురాలేకపోతున్నారు. గత 24 గంటల్లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్,గ్రేటర్ లాస్ ఏంజిల్స్ ప్రాంతాల్లో 70,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Also Read: Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా - Rtvlive.com